ఈ సినిమా నుంచి విడుదలైన మొదటి సాంగ్ అరబిక్ కుత్తు పెద్ద హిట్టైంది.   రీసెంట్ గా ఈ సినిమా నుంచి రెండో సింగిల్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. జాలీ ఓ జింఖానా అంటూ సాగే ఈ పాటను హీరో విజయ్ పాడడం విశేషం. కేక  పెట్టించే రీతిలో విజయ్ , పూజా వేసిన స్టెప్పులు ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ సాంగ్ వీడియో వైరల్ గా మారింది. 


 తలపతి విజయ్‌, బుట్ట బొమ్మ పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘బీస్ట్‌’. ఇటీవల ఈ మూవీ నుంచి విడుదలైన అరబిక్‌ కుతు పాట నెట్టింట సంచలన సృష్టించింది. విడుదలైన కాసేపటికే మిలియన్‌పైగా వ్యూస్‌ తెచ్చుకుని యూట్యూబ్‌ ట్రెండింగ్‌ జాబితాలో నిలిచింది. ఇప్పుడు మరో పాట విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఏప్రియల్ 13న రిలీజ్ కు రెడీ అయ్యిన ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ కు రంగం సిద్దమైంది.

Scroll to load tweet…
Scroll to load tweet…

తమిళ సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం ట్రైలర్ ఏప్రియల్ 2 వ తేదీన గ్రాండ్ గా విడుదల కానుంది. డార్క్ కామెడీ థ్రిల్లర్ గా చెప్పబడుతున్న ఈ చిత్రంపై మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమా కోసం విజయ్‌ ఫ్యాన్స్‌ చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. కేవలం తమిళంలోనే కాకుండా తెలుగు,మళయాళంలోనూ ఈ సినిమా రిలీజ్ కానుంది. నెల్సన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాను పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదల చేయనున్నారు. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కతున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది.

 సన్ పిక్చర్స్ బ్యానర్ లో కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన మొదటి సాంగ్ అరబిక్ కుత్తు పెద్ద హిట్టైంది. రీసెంట్ గా ఈ సినిమా నుంచి రెండో సింగిల్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. జాలీ ఓ జింఖానా అంటూ సాగే ఈ పాటను హీరో విజయ్ పాడడం విశేషం. కేక పెట్టించే రీతిలో విజయ్ , పూజా వేసిన స్టెప్పులు ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ సాంగ్ వీడియో వైరల్ గా మారింది.

ఈ సినిమాలో విజయ్‌, పూజాల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్‌ అయింది. బుట్టబొమ్మ పాటలో స్టెప్స్‌తో యువతను ఉర్రుతలుగించిన పూజా హెగ్డే మరోసారి ఈ పాటతో ఆకట్టుకుంది. పూజా అందం, స్టెప్స్‌తో మెస్మరైజ్‌ చేసిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 14న విడుదల చేయనున్నారు.

అందుతున్న సమాచారం ప్రకారం బీస్ట్ స్టోరీ మొత్తం ఒక పెద్ద షాపింగ్ మాల్ లో జరుగుతుందని వినికిడి. ఇంట్రడక్షన్, పాటలు మినహాయించి సినిమా చివరిదాకా విజయ్ ఒకే కాస్ట్యూమ్ లో అది కూడా తెల్లని ప్యాంట్ బనియన్ తో ఉంటాడని చెప్తున్నారు. మాల్ లో బందీలు కాబడిన వారిని కాపాడే మిషన్ మీద వచ్చిన ఆఫీసర్ గా విజయ్ క్యారెక్టర్ డిఫరెంట్ గా ఉంటుందని అంటున్నారు.

ఇక బీస్ట్ తెలుగులోనూ భారీగా రిలీజ్ కానుంది. అలాగే తమిళ,తెలుగులలో ఒకేసారి రిలీజ్ అవుతుంది. ఇక్కడ హక్కులు కొన్న నిర్మాత ఎవరో ఇంకా బయిటకు రాలేదు. సన్ పిక్చర్స్ నిర్మాణం కాబట్టి పెద్దన్న, ఈటిల ద్వారా నష్టపోయిన వాళ్ళకే దీన్ని ఇచ్చే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ లో వినపడుతోంది.