యంగ్‌ మ్యూజిక్‌ సన్సెషన్‌ అనిరుద్‌ రవిచంద్రన్‌ స్వరాలను అందిస్తున్న ఈ మూవీలోని పాటలకు వీపరితమైన రెస్పాన్స్‌ వస్తుంది. ఇటీవల విడుదలైన అరబిక్‌ కుత్తు పాట సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 


బాహుబలి,ఆర్.ఆర్.ఆర్ హిందీలో సక్సెస్ అయ్యాక ...దాదాపు పెద్ద హీరోలందరూ తమ సినిమాలను నార్త్ మార్కెట్ లో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. అందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఎవరూ సక్సెస్ అవ్వటం లేదు. తాజాగా కేజీఎఫ్ 2, బీస్ట్ చిత్రాలు రెండు కూడా హిందీ రిలీజ్ కు వెళ్తున్నాయి. మరి ఎక్కడ ఈ చిత్రాలకు బిజినెస్ అయ్యిందా...పట్టించుకుంటున్నారా ?

కోలీవుడ్‌ స్టార్ హీరో విజయ్‌, టాలీవుడ్‌ బుట్టబొమ్మ పూజా హెగ్డే జోడిగా నటించిన చిత్రం 'బీస్ట్‌'. ఈ సినిమా హిందీలో రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. అలాగే హిందీలోనూ ఈ చిత్రం ట్రైలర్ ని విడుదల చేసారు. బీస్ట్‌ మూవీపై బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ ఇంట్రస్టింగ్ వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల హిందీలో విడుదలైన బీస్ట్‌ ట్రైలర్‌ చూసిన షారుక్‌ విజయ్‌పై ప్రశంసలు కురిపించాడు. మేరకు ఆయన ట్వీట్‌ చేస్తూ విజయ్‌కి పెద్ద ఫ్యాన్‌ అంటూ చెప్పుకొచ్చాడు. ఈ నేపథ్యంలో బీస్ట్‌ ట్రైలర్‌ను కూడా షేర్‌ చేశాడు. ఈ సందర్బంగా ‘నేను డైరెక్టర్‌ అట్లీతో కూర్చున్నాను. నాలాగే ఆయన కూడా విజయ్‌కి పెద్ద ఫ్యాన్‌. బీస్ట్‌ ట్రైలర్‌ చూశాను. అద్భుతంగా ఉంది. బీస్ట్‌ మూవీ టీం అందరికి శుభాకాంక్షలు’ అంటూ కింగ్‌ ఖాన్‌ రాసుకొచ్చాడు.

దాంతో హిందీలో ఈ చిత్రం భారీగా రిలీజ్ చేస్తారని అందరూ భావించారు. కానీ ఏదో ఫార్మాలిటీగా మాత్రమే రిలీజ్ అవుతున్నట్లు అనిపిస్తోంది. హిందీ సర్క్యూట్స్ లో ఈ చిత్రం ప్రమోషన్స్ జరగటం లేదు. నార్త్ లో చాలా మందికి ఈ సినిమా హింది వెర్షన్ రిలీజ్ అవుతున్నట్లే తెలియని పరిస్దితి. దాంతో కేవలం తమిళం,తెలుగు మార్కెట్లపైనే ఈ చిత్రం దృష్టి పెట్టినట్లు అర్దమవుతోంది.

 ఇక బీస్ట్‌ ట్రైలర్‌ అన్ని భాషల్లో విడుదలై మంచి పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంటుంది. ఈ ట్రైలర్‌లోని యాక్షన్‌ సీన్స్‌, విజయ్‌ స్టెమినా చూస్తుంటే సినిమాపై మరింత హైప్‌ క్రియేట్‌ చేస్తోంది. కాగా ఈ మూవీ ఏప్రిల్‌ 13న దేశవ్యాప్తంగా విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. యంగ్‌ మ్యూజిక్‌ సన్సెషన్‌ అనిరుద్‌ రవిచంద్రన్‌ స్వరాలను అందిస్తున్న ఈ మూవీలోని పాటలకు వీపరితమైన రెస్పాన్స్‌ వస్తుంది. ఇటీవల విడుదలైన అరబిక్‌ కుత్తు పాట సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే.