మెర్సల్ - సర్కార్ సినిమాలతో ఈజీగా 200 కోట్ల క్లబ్ ని టచ్ చేసిన కోలీవుడ్ హీరో విజయ్. నెక్స్ట్ సినిమా కూడా అదే రేంజ్ లో రికార్డులు సృష్టించేలా ఉందని టాక్ వస్తోంది. ఎందుకంటే విజయ్ నెక్స్ట్ యువ దర్శకుడు అట్లీ తో వర్క్ చేయడానికి సిద్దమైన సంగతి తెలిసిందే. 

ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇంకా మొదలేకాలేదు అప్పుడే బిజినెస్ డీల్స్ ఓ రేంజ్ లో సెట్టవుతున్నాయి. రీసెంట్ గా సినిమాకు సంబందించిన డిజిటల్ - శాటిలైట్ రైట్స్ ధర 60 కోట్లకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. సన్ నెట్వర్క్ అన్ని భాషల్లో సినిమా హక్కుల్ని దక్కించుకున్నట్లు సమాచారం. 

స్పోర్ట్స్ డ్రామాలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ కోచ్ గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఒక ఫుట్ బాల టీమ్ కు కోచ్ గా ఉంటూ పలు సామజిక అంశాలపై పోరాడే వ్యక్తిగా విజయ్ కనిపిస్తాడట. వచ్చే ఏడాది సినిమాను ప్రేక్షకుల ముందుకు తేవడానికి దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడు.