క్రైమ్ థ్రిల్లర్స్ చుట్టూ  పరుగులు తీస్తోంది తమిళ చిత్ర పరిశ్రమ. రాక్షసన్ హిట్ తర్వాత అక్కడ చాలా క్రైమ్ థ్రిల్లర్స్ రెడీ అవుతున్నాయి. తాజాగా ‘కొలైగార‌న్’ టైటిల్ తో మరో చిత్రం రెడీ అవుతోంది. విజయ్ ఆంటోనీ, యాక్షన్ కింగ్ అర్జున్ ప్రధాన పాత్రల్లో న‌టించిన ఈ తాజా తమిళ చిత్రం  ‘కిల్లర్‌’ టైటిల్ తో తెలుగులో విడుదల చేస్తున్నారు. . ఆండ్రూ లూయిస్ దర్శకుడు. అషిమా హీరోయిన్ . 

దియా మూవీస్‌ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రం మర్డర్‌ మిస్టరీ, క్రైమ్‌ థ్రిల్లర్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కింది. ఈ సినిమా ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుండగా జూన్ 5న‌ సినిమా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా టీజ‌ర్, పాటలు రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా ఈ చిత్రం ట్రైలర్‌ని  తాజాగా  రిలీజ్ చేశారు నిర్మాతలు. ట్రైలర్ సైతం చాలా ఇంట్రస్టింగ్ గా సాగింది. 

  ‘ఒక్క హత్యేంటి.. ఎన్ని హత్యలైనా చేయడానికి రెడీ’ అంటున్నారు  విజయ్‌ ఆంటోనీ.  ఇందులో విజయ్‌ హంతకుడిగా కనిపించారు. అర్జున్‌ పోలీసు అధికారిగా కేసు విచారిస్తున్నారు. ‘అయితే.. అతను ఇవన్నీ చేసింది ఆ అమ్మాయి మీద ఉన్న ప్రేమ కోసమా..? అది కూడా వన్‌ సైడ్‌ లవ్‌..’ అంటూ నాజర్‌ ప్రశ్నించడం కథపై  ఇంట్రస్ట్ ని పెంచుతోంది. 

‘నువ్వు హత్య చేశావు..’ అని అర్జున్‌ అంటూంటే.. ‘ఒక్క హత్యేంటి.. ఎన్ని హత్యలైనా చేయడానికి రెడీ’ అన్నారు విజయ్‌. జూన్‌ 5న ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

నిర్మాతలు మాట్లాడుతూ...ఈ చిత్ర కథ ఎంతో ఆసక్తిగా ఉన్నందువల్లే ఈ సినిమా ని తెలుగులో విడుదల చేసేందుకు సిద్ధమ‌య్యాం.. ప్రేక్షకులు కోరుకునే థ్రిల్లర్ అంశాలు అన్ని ఇందులో ఉన్నాయి.. సినిమా ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.. అన్పీ వ‌ర్గాల్ని మెప్పించే ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఉన్న చిత్రమిది. అర్జున్ న‌ట‌న సినిమాకే హైలైట్..అన్నారు.. సైమన్.కె.కింగ్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమా కి మాక్స్ సినిమాటోగ్రఫీ ని అందిస్తున్నారు`` అన్నారు నిర్మాత‌లు.