పిల్లల సూసైడ్స్ పై గతంలో కామెంట్స్ చేసిన విజయ్ ఆంటోనీ, తన కూతురు విషయంలో ఏం జరిగింది..?
తమిళ స్టార్ హీరో, మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ ఆంటోనీ కూతురు లారా ఆంటోనీ ఆత్మహత్య చేసుకున్నారు. 16 ఏళ్ళ వయస్సులో ఆమె ఉరివేసుకుని మరణించారు. ఈనేపథ్యంలో విజయ్ ఆంటోనీ సూసైడ్స్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

తమిళ స్టార్ హీరో, మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ ఆంటోనీ కూతురు లార మరణం కోలీవుడ్ లో సంచలనంగా మారింది. 16 ఏళ్ళ వయ్సులో 12వ తరగతి చదువుతున్న లార.. తన గదిలో ఫ్యాన్ కు ఊరి వేసుకుని మరణించినట్టు తెలుస్తోంది. తెల్లవారుజామున 3 గంటలకు ఆమె ఆత్మహత్య చేసుకోగా.. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను కావేరి హాస్పిటల్ కు తరలించగా. అప్పటికే ఆమె మృతి చెందినట్టు సమాచారం. ఆసమయంలో విజయ్ ఆంటోనీ ఇంట్లో లేరని అంటున్నారు.
అయితే లార మానసిక ఒత్తిడి కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. చదువు విషయంలో ఆమెపై ఉన్న ప్రెజర్ కారణంగానే సూసైడ్ చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంలో గతంలో విజయ్ ఆంటోనీ కామెంట్స్ కూడా వైరల్ అవుతుంది. ఆత్మహ్యలపై.. ముఖ్యంగా పిల్లల ఆత్మహత్యలకు గల కారణాలను వివరిస్తూ.. విజయ్ ఆంటోనీకామెంట్స్ చేశారు
గతంలో సూసైడ్ థాట్స్ గురించి కొన్ని విషయాలు చెప్పాడు విజయ్ ఆంటోనీ. అసలు ఆత్మహత్య ఎందుకు చేసుకుంటారు? ఆ ఆలోచనలు ఎందుకు వస్తాయ్ అనేదానిపై మాట్లాడాడు. ఎవరినైనా ఎక్కువగా నమ్మి మోసపోయినప్పుడు, చెప్పినట్టుగా, కమిట్మెంట్ ఇచ్చినట్టుగా పని చేయలేకపోయినప్పుడు.. చిన్నపిల్లలకు అయితే చదువు విషయం వల్ల వచ్చే ఒత్తిడితో సూసైడ్ థాట్స్ వస్తాయని విజయ్ ఆంటోని అన్నారు.
అంతే కాదు పిల్లలకు ఒత్తిడి లేకుండా చూసుకోవాలని.. వారిపై ప్రెజర్ పెట్టవద్దని..ముఖ్యంగా స్కూల్ నుంచి వచ్చాక పిల్లలను చాలా కూల్ గా డీల్ చేయాలి.. అంతే కాని.. ట్యూషన్‌కి పో అక్కడికి ఇక్కడికిపో.. అని అంటుంటారు.. కాని వాళ్లని సొంతంగా ఆలోచించే టైమ్ ఇవ్వడంలేదు. మన చుట్టు పక్కల వాళ్ల వల్లే మనం కూడా అలా చేస్తున్నాం.. పిల్లలను కాస్త ఫ్రీగా వదిలేయాలి.. సొంతంగా ఆలోచించుకోనివ్వాలి అంటూ విజయ్ ఆంటోని చేసిన కామెంట్స్.. దానికి సబంధించిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఇక ఇప్పుడు ఏకంగా విజయ్ కూతురే ఇలా ఆత్మహత్య చేసుకోవడంపై రకరకాల వాదనలువినిపిస్తున్నాయి. ఒక వేళ విజయ్ ఆంటోని తన కూతురి విషయంలో తాను చెప్పినవి పాటించలేదా...? సాధారణ తండ్రిగానే ప్రవర్తించాడా?.. ఆయన గతంలో చెప్పిన విధంగా తన పిల్లలతో ఉండటంలేదా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. అంతే కాదు అసలు విజయ్ ఆంటోని కూతురు ఆత్మహత్యకి కారణం ఏంటీ..? అనేది తెలియాల్సి ఉంది. విజయ్ ఆంటోనీ ఈ విషయంలో ఎలా స్పందిస్తారో చూడాలి.