కోలీవుడ్ లో సూపర్ స్టార్ రాజినీకాంత్ తరువాత ఆ స్థాయి కలెక్షన్స్ అందుకునే హీరో విజయ్. మెర్సల్ - సర్కార్ సినిమాలతో ఒక ట్రెండ్ సెట్ చేసిన ఈ బాక్స్ ఆఫీస్ కింగ్ నెక్స్ట్ కూడా అదే తరహాలో మరో బిగ్ హిట్ కొట్టాలని అనుకుంటున్నాడు. అట్లీ దర్శకత్వంలో మూడవసారి విజయ్ నటిస్తున్న చిత్రం స్పోర్ట్స్ డ్రామాలో తెరకెక్కనుంది. 

అయితే ఇందులో విజయ్ ఒక ఫుట్ బాల్ కోచ్ గా కనిపించనున్నాడు. గతంలో అమిర్ ఖాన్ నుంచు వచ్చిన లగాన్ సినిమా ఎలాంటి ఎమోషన్ ని క్రియేట్ చేసిందో అదే స్థాయిలో ఈ సినిమా కూడా ఆడియెన్స్ కి కనెక్ట్ అవుతుందని సమాచారం. సంగీత దర్శకుడు రెహమాన్ కూడా ఇటీవల అదే విషయాన్నీ చెప్పాడు. సినిమాలో కొంత మంది స్టార్ నటీనటులు నటించబోతున్నారు. ఇకపోతే సినిమాకు సంబందించిన మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. 

విజయ్ నటిస్తోన్న పాత్ర పేరు మైకేల్ అని తెలిసింది. కోచ్ గా యువతరంకు అదిరిపోయే మోటివేషనల్ స్పీచ్ లను ఇస్తూ విజయ్ అగ్రెసివ్ గా కనిపిస్తాడని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. సరికొత్త లుక్ లో విజయ్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేస్తాడని టాక్. ప్రస్తుతం చెన్నై పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.