నయనతార, విజ్ఞేశ్ శివన్ ప్రేమలో ఉన్నారనే సంగతి తెలిసిందే. వీరిద్దరికీ పెళ్లి కూడా జరిగిందని టాక్. కానీ ఆ విషయాన్ని బయటకి తెలియనివ్వకుండా ఉంచుతున్నారని కోలివుడ్ మీడియా అంటోంది.

ఈ సంగతి పక్కన పెడితే నయనతార తన బాయ్ ఫ్రెండ్ ని వదిలేసి ఒక్క నిమిషం కూడా ఉండడం లేదట. తన వెంటే విజ్ఞేశ్ ని షూటింగ్ లకు వెంటబెట్టుకొని తిరుగుతుందట. విజ్ఞేశ్ కూడా నయనతారకి సంబంధించిన వ్యవహారాలన్నీ దగ్గరుండి చూసుకుంటున్నాడట.

ఓ వైపు నయన్ వరుస పెట్టి సినిమాలు చేస్తుంటే విజ్ఞేశ్ మాత్రం తన పని మానుకొని ఆమె చుట్టూ తిరగడంపై అతడిపై జోకులు వేస్తున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ అయిన విజ్ఞేశ్ ఇప్పటివరకు మూడు సినిమాలే చేశాడు. నయనతారతో 'నానుమ్ రౌడీ తాన్' అనే సినిమాను రూపొందించాడు విజ్ఞేశ్. ఆ తరువాత ఇద్దరూ ప్రేమలో పడ్డారు. 

నయన్ తో ప్రేమలో పడిన తరువాత విజ్ఞేశ్.. సూర్యతో 'గ్యాంగ్' అనే ఒక్క సినిమా మాత్రమే తీశాడు. ఆ తరువాత ఇప్పటివరకు మరో ప్రాజెక్ట్ జోలికి వెళ్లలేదు. నయనతార ప్రియుడిని పని కూడా చేయనివ్వకుండా తన కొంగుకి కట్టేసుకుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.