పోలీసుల అదుపులో విద్యుత్ జమ్వాల్, బాలీవుడ్ హీరో అంత పనిచేశాడా..?
చట్టాలు సామాన్యులకైనా.. సెలబ్రిటీలకైనా సమానమే.. ఒక రకంగా చెప్పాలంటే.. సామన్యులు తప్పు చేస్తే తెలియదేమో కాని.. సెలబ్రిటీలు చేస్తూ..వెంటనే వైరల్ అవుతుంది. ఇదిగో ఏం తప్పు చేశారో ఏమో కాని...బాలీవుడ్ హీరో విద్యుత్ జామ్వాల్ ను రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
విద్యుత్ జామ్వాల్ అంటే అర్ధం కాదు కాని..చూస్తె వెంటనే గుర్తు పడతారు.. బాలీవుడ్ లో హీరోగా.. ఇతర ఇండస్ట్రీల్లోవిలన్ గా నటిస్తూ.. టోన్డ్ బాడీతో.. హ్యాండ్సమ్ లుక్స్ తో.. స్టార్ హీరోలకు ఏమాత్రం తక్కువ కాదు అన్నట్టు ఉంటాడు. రోజులోఎక్కవ టైమ్ కసరత్తులకే కేటాయించే ఈ హీరో.. టాలీవుడ్ లో కూడా చాలా సినిమాల్లో కనిపించాడు. ఎక్కువగా విలన్ పాత్రలో అలరించాడు విద్యుత్. సినిమాలతో పాటు.. విన్యాసాలు చేయడం..విచిత్రంగా వీడియోలు చేయడంలాంటి పనులు చేస్తుంటాడు బాలీవుడ్ హీరో.
ఆ మధ్య హిమాలయాల్లోనగ్నంగా తిరుగుతూ..వింత పోస్ట్ లు పెట్టిన విద్యుత్.. ఈసారి ఏం పనిచేశాడో కాని.. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ జామ్వాల్ కు ప్రత్యేక ఫాలోయింగ్ ఉంది. వరల్డ్ వైడ్ ఉన్న ఆరు అగ్రశేణి మార్షల్ ఆర్టిస్టులలో ఒకరిగా ఆయనకు ఓ గుర్తింపు ఉంది. లూపర్ క్యూరేట్ చేసిన ప్రతిష్టాత్మక జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయుడిగా రికార్డ్ క్రియేట్ చేశాడు జమ్వాల్. అలాంటి ఆయన ఇటీవల ఊహించని ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది.
ఇంతకీ ఆయన్ను పోలీసులు ఎందుకు అదుపులోకితీసుకున్నారంటే.. ప్రమాదకరమైన విన్యాసాలు చేసినందు. ఈ విన్యాసాలే ఆయనకు రికార్డ్ తెచ్చిపెడితే.. ఇండియాలో ఇలాంటివి చాలాప్రమాదకరమంటూ.. ముంబై రైల్వే పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పోలీస్ స్టేషన్లో అధికారుల ముందు జమ్వాల్ కూర్చున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతుంది. కానీ ఇందుకు సంబంధించి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు. ఈవార్తలు ఖండించనూలేదు విద్యుత్. దాంతో ఇది నిజం అని ఫిక్స్ అవుతున్నారు ప్రేక్షకులు.
ముంబైలోని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) బాంద్రా కార్యాలయంలో ఈ ఫోటో తీసినట్లుగా తెలుస్తోంది. అయితే జమ్వాల్ అరెస్ట్ గురించి ఎలాంటి సమాచారం లేదు.. కానీ ప్రమాదకరమైన విన్యాసాలు చేసినందుకు అతడిని అదుపులోకి తీసుకున్నట్లు టాక్. మరి రైల్వే పోలీసులు అదుపులో తీసుకున్నారంటే.. ఏ పట్టాలమీదనో.. రైల్ లోనో... రైల్ పైనో ఏదో ఒకటి చేసి ఉంటాడు ఈ హీరో అని అనుకుంటున్నారు