Asianet News TeluguAsianet News Telugu

డేంజరస్ విలన్ తో చేతులు కలిపిన ఘాజి డైరెక్టర్.. స్టోరీ గురించి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్

ఘాజి చిత్రంతో దర్శకుడు సంకల్ప్ రెడ్డి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. ఘాజి చిత్ర తెలుగుతో పాటు హిందీలో కూడా విడుదలై విజయాన్ని అందుకుంది. ఆ చిత్రం అందించిన స్పూర్తితో రిస్క్ అయినా కూడా అంతరిక్ష పరిశోధన నేపథ్యంలో వరుణ్ తేజ్ తో అంతరిక్షం చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. 

Vidyut Jammwal and Sankalp Reddy movie shooting started
Author
Hyderabad, First Published Jan 13, 2022, 5:20 PM IST

ఘాజి చిత్రంతో దర్శకుడు సంకల్ప్ రెడ్డి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. ఘాజి చిత్ర తెలుగుతో పాటు హిందీలో కూడా విడుదలై విజయాన్ని అందుకుంది. ఆ చిత్రం అందించిన స్పూర్తితో రిస్క్ అయినా కూడా అంతరిక్ష పరిశోధన నేపథ్యంలో వరుణ్ తేజ్ తో అంతరిక్షం చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయాన్ని అందించలేకపోయింది.  

సంకల్ప్ రెడ్డి మాత్రం విభిన్నమైన చిత్రాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. మరో ఆసక్తికర చిత్రానికి సంకల్ప్ రెడ్డి రెడీ అవుతున్నారు. కాకపోతే ఒక ట్విస్ట్. సంకల్ప్ రెడ్డి తదుపరి చిత్రం హిందీ నటుడు విధ్యుత్ జమాల్ తో ఉండబోతోంది. విధ్యుత్ జమాల్ తెలుగు, తమిళ భాషల్లో విలన్ గా నటించాడు. 

శక్తి, ఊసరవెల్లి, తుపాకీ లాంటి చిత్రాల్లో విధ్యుత్ జమాల్ డేంజరస్ విలన్ గా నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం విధ్యుత్ జమాల్ నార్త్ లో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఇప్పటికే కొన్ని చిత్రాల్లో ప్రధాన పాత్రల్లో నటించాడు. 

ఘాజి, అంతరిక్షం చిత్రాలతో సంకల్ప్ రెడ్డి ప్రతిభ గుర్తించిన విధ్యుత్ జమాల్ అతడి దర్శకత్వంలో నటించేందుకు రెడీ అయ్యాడు. స్వయంగా తానే ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. ఈ చిత్రానికి 'ఐబీ 71' అనే టైటిల్ ఖరారైంది. 

1971లో ఇండో పాక్ వార్ నేపథ్యంలో ఈ చిత్రం ఉండబోతోంది. అప్పట్లో ఇంటెలిజెన్స్ బ్యూరో ఎలా పనిచేసింది అని అధ్యయనం చేసి సంకల్ప్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో విధ్యుత్ ఇంటెలిజెన్స్ గూఢచారిగా నటిస్తున్నాడు. నేడే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios