ప్రముఖ లేడి కమెడియన్ విద్యుల్లేఖ రామన్ సీక్రెట్ గా వివాహం చేసుకుంది. తెలుగు తమిళ భాషల్లో విద్యుల్లేఖ అనేక చిత్రాల్లో కమెడియన్ గా, హీరోయిన్ ఫ్రెండ్ పాత్రల్లో నటించింది.
ప్రముఖ లేడి కమెడియన్ విద్యుల్లేఖ రామన్ సీక్రెట్ గా వివాహం చేసుకుంది. తెలుగు తమిళ భాషల్లో విద్యుల్లేఖ అనేక చిత్రాల్లో కమెడియన్ గా, హీరోయిన్ ఫ్రెండ్ పాత్రల్లో నటించింది. ఆగస్టు నెలలో ఎవరూ ఊహించని విధంగా విద్యుల్లేఖ ఎగేజ్మెంట్ పూర్తయింది.
ఆ సమయంలో విద్యుల్లేఖ వివాహం గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. కానీ గురువారం సెప్టెంబర్ 9న విద్యుల్లేఖ పెళ్లి పూర్తయినట్లు తెలుస్తోంది. తనని అందంగా మార్చిన ఫిట్నెస్ నిపుణుడు సంజయ్ తో ఆమెకు పరిచయం ఏర్పడడం.. అది ప్రేమగా మారడం జరిగింది.
దీనితో ఈ జంట వివాహం చేసుకున్నారు. తమిళ సాంప్రదాయ పద్ధతుల్లో వీరిద్దరి వివాహం వైభవంగా జరిగినట్లు తెలుస్తోంది. అయితే కరోనా నిబంధనల మేరకు ఈ వేడుక ప్రైవేట్ గా జరిగింది. కేవలం కొంతమంది బంధువులు, స్నేహితులు సమక్షంలో జరిగింది.
అంతకు ముందు విద్యుల్లేఖ బొద్దుగా కనిపించేది. ఆమె శరీరాకృతిపై సినిమాల్లో జోకులు కూడా వేసేవారు. కానీ తాను కూడా గ్లామర్ గా మారగలనని విద్యుల్లేఖ నిరూపించింది. ఫిట్నెస్ పై ఫోకస్ పెట్టి కసరత్తులు చేసింది. ఆమెకు తన ప్రియుడు,ఇప్పుడు భర్త అయిన సంజయ్ కూడా హెల్ప్ చేయడంతో విద్యుల్లేఖ మునుపటికంటే నాజూగ్గా మారింది.
సోషల్ మీడియాలో ఆమె లుక్స్ చూసి నెటిజన్లు కూడా ఫిదా అయ్యారు. విద్యుల్లేఖ తెలుగులో ధృవ, రాజా ది గ్రేట్, సరైనోడు లాంటి చిత్రాల్లో హాస్యం పండించింది. చివరగా అల్లుడు అదుర్స్ చిత్రంలో విద్యుల్లేఖ నటించింది.
