వెంకీ నెక్ట్స్ ఆ యంగ్ డైరక్టర్ తో ఖరారు

ప్రశంసలు పొందిన మలయాళ థ్రిల్లర్ “దృశ్యం-2” తెలుగు రీమేక్ అదే టైటిల్ తో తెలుగులో రూపొందుతోంది. ఈ చిత్రం లాక్డౌన్ పూర్తయిన వెంటనే తెరపైకి రానుంది. నారప్ప, ఎఫ్ 3 చిత్రాలు ఈ ఏడాది చివర్లో థియేటర్లలోకి రానున్నాయి. ఈ సినిమా తర్వాత ఓ యంగ్ డైరక్టర్ సినిమా చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఆ డైరక్టర్ మరెవరో కాదు వెంకటేష్ మహా. 

Victory Venkatesh Ready for OTT Debut? jsp

విక్టరీ వెంకటేష్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. సీనియర్ హీరో అయినప్పటికీ యంగ్ హీరోలతో పోటీ పడుతూ వరుసగా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం వెంకటేష్ నటించిన మూడు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వెంకటేష్ హీరోగా నటించిన మూడు విభిన్న జోనర్ చిత్రాలు నారప్ప, దృశ్యం-2, ఎఫ్-3 చిత్రాల విడుదల గురించి ఆయన అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ప్రశంసలు పొందిన మలయాళ థ్రిల్లర్ “దృశ్యం-2” తెలుగు రీమేక్ అదే టైటిల్ తో తెలుగులో రూపొందుతోంది. ఈ చిత్రం లాక్డౌన్ పూర్తయిన వెంటనే తెరపైకి రానుంది. నారప్ప, ఎఫ్ 3 చిత్రాలు ఈ ఏడాది చివర్లో థియేటర్లలోకి రానున్నాయి. ఈ సినిమా తర్వాత ఓ యంగ్ డైరక్టర్ సినిమా చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఆ డైరక్టర్ మరెవరో కాదు వెంకటేష్ మహా. 

కేర్ ఆఫ్ కాంచరపాలెం దర్శకుడు వెంకటేష్ మహాతో ఓ ప్రాజెక్ట్ లో నటించడానికి వెంకటేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఆయన్ను మహా ఇటీవల కలిసి ఒక కథతో మెప్పించాడట. లాక్డౌన్ తర్వాత ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉందని సమాచారం.   హీరో రాజశేఖర్‌తో కలిసి వెంకటేష్ మహా తెరకెక్కిస్తున్న “మర్మాణువు” చిత్రం ఈ ఏడాది చివర్లో తెరపైకి రానుంది. ఈ సినిమా తర్వాత ఈ సీనియర్ హీరో చిత్రం ఉండనుందిట. 

కేరాఫ్ కంచరపాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపస్యః మూవీలతో వరుస హిట్స్ ని తన ఖాతాలో వేసుకున్న ఈ దర్శకుడు మూడో సినిమాని తనకి మొదటి అవకాశం ఇచ్చిన నిర్మాత ప్రవీణ పరిచూరితోనే చేస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీని ఎనౌన్స్ చేసేశారు. కంప్లీట్ గా యూస్ బ్యాక్ డ్రాప్ లోనే ఈ మూవీని డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు.మరో వైపు సురేష్ ప్రొడక్షన్ లో కూడా ఒక సినిమా చేయడానికి ఇప్పటికే సైన్ చేశాడు. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ని ఏకంగా విక్టరీ వెంకటేష్ తో చేయబోతున్నట్లు తెలుస్తుంది.అది కూడా ఒటీటీ కోసమే ప్రత్యేకంగా ఈ మూవీని సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios