చిరంజీవి వల్లే సినిమాల్లోకి, లేకుంటే హీమాలయాలే.. విక్టరీ వెంకటేష్ కామెంట్స్

మెగాస్టార్ చిరంజీవి వల్లే తాను ఇప్పటికీ సినిమాలు చేస్తున్నాను అన్నారు టాలీవుడ్ విక్టరీ స్టార్ వెంకటేష్. లేకుంటే ఇప్పటికే హిమాలయాలకు వెళ్లిపోయేవాడిని అంటున్నారు వెంకీ. ఇంతకీ విషయం ఏంటంటే..?
 

Victory Venkatesh Comments About Megastar Chiranjeevi JMS

టాలీవుడ్ లో వరుస విజయాల హీరోగా గుర్తింపు పొందాడు వెంకటేష్. అందుకేఈసీనియర్ హీరోను  విక్టరీ వెంకటేష్ గా పిలుస్తాం. తాజాగా  తన కెరీర్ లో 75 సినిమాలు పూర్తి చేసుకుంటున్నారు వెంకీ. రీమేక్ సినిమాలకు టాలీవుడ్ లో బ్రాండ్ అంబాసిడర్  అంటే వెంకీనే గుర్తుకువస్తారు. తాజాగా తన 75వ సిపిమా.. ల్యాండ్ మార్క్ మూవీగా సైంధవ్‌ సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకురావడం కోసం ఏర్పాట్లు చేస్తున్నాడు వెంకీ.   ఈ సంక్రాంతికి సైంధవ్  ఆడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు. 

అయితే వెంకటేష్  75 సినిమాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా  శుభాకాంక్షలు తెలియచేస్తూ సైంధవ్‌ నిర్మాణ సంస్థ నిహారిక ఎంటర్టైన్మెంట్స్ గ్రాండ్ ఈవెంట్ ని నిర్వహించింది. ఈ ఈవెంట్ కి టాలీవుడ్ సీనియర్ హీరోలు లతో పాటు.. టాలీవుడ్ పెద్దలనుకూడా ఇన్ వైట్ చేశారు. టాలీవుడ్ లో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ , నాగార్జున ఈ నలుగురుటైర్ 1 హీరోలుగా..స్టార్ ఇమేజ్ తో దూసుకుపోయారు. 60 ప్లాస్ లో కూడా వీరు సినిమాలు చేస్తూనే ఉన్నారు. అయితే ఈ ఈవెంట్లో నలుగురు కలిసి కనిపిస్తారు అనుకంుటే అది సాధ్యం కాలేదు. 

ఇక ఈ వేడుకలకు  చిరంజీవి, రాఘవేంద్రరావు ముఖ్య అతిథిగా వచ్చారు. అలాగే నాని, శ్రీవిష్ణు, అడివిశేష్, బ్రహ్మానందం, అలీ.. ఇలా పలువురు సినీ ప్రముఖులతో పాటు సైధవ మూవీ టీమ్ కూడా ఈవెంట్ లో సందడి చేశారు. ఈ ఈవెంట్ లో వెంకటేష్ మాట్లాడుతూ. తన 75 సినిమాల ప్రయాణం గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అంతే కాదు కాస్త ఎమోషనల్ కూడా అయ్యాడు. వెంకటేష్ కు స్పిరుచువల్ భావాలు ఎక్కువ. ఆయన చదివే పుస్తకాలు, సిద్దాంతాలు, ఆధ్యాత్మికతను పెంచేలా ఉంటాయి. ఈ విషయానికి లింక్ చేస్తూ ఓ ఇంట్రెస్టింగ్ టాపిక్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.  

వెంకటేష్ మాట్లాడుతూ.. మా గురువు రాఘవేంద్రరావు దర్శకత్వంలో కలియుగ పాండవులు సినిమాతో నా ప్రయాణం మొదలైంది. దాసరి, విశ్వనాథ్ గారి లాంటి అగ్ర దర్శకులతో పనిచేసే అదృష్టం దక్కింది. అభిమానులు ఇచ్చిన ప్రేమతోనే ఇన్ని సినిమాలు చేశాను. జయాపజయాలు చూడకుండా నా సినిమాలని ఆదరించారు. విక్టరీ, రాజా, పెళ్లి కానీ ప్రసాద్, పెద్దోడు, వెంకీమామ.. ఇలా ఎన్నో పేర్లతో పిలిచారు. పిలుపులు మారినా అభిమానుల ప్రేమ మారలేదు. అందుకే ఎప్పుడూ ఉత్సాహంగా పనిచేస్తూ వచ్చాను అన్నారు. 

ఇక  గతంలో చాలా సార్లు సినిమాలు వదిలేసి హిమాలయాలకు వెళ్లిపోదామనుకున్నాను. చిరంజీవి గారు లేకుంటే సినిమా మానేసి నేను హిమాలయాలకు వెళ్లి ఉండేవాడిని. ఒకసారి అలాగే వెళ్ళిపోదాం అనుకుని రెడీ అయ్యాను కూడా.. కాని 9 సంవత్సరాల విరామం తరువాత కూడా మెగాస్టార్ చిరంజీవి గారు ఖైదీ నంబర్ 150తో బ్లాక్‌బస్టర్‌ను అందించడం చూసి.. నేను కూడా నటన కొనసాగించాలి అనుకున్నాను. చిరుతో పాటు బాలయ్య, నాగార్జున కూడా తనకు పాజిటీవ్ఎనర్జి ఇచ్చారన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios