విక్టరీ వెంకీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు

First Published 13, Dec 2017, 10:30 AM IST
victory venkatesh birthday special wishes
Highlights
  • నేడు వెంకీ పుట్టినరోజు
  • తనదైన ప్రత్యేకతతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన వెంకీ
  • వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా ఆసియానెట్ శుభాకాంక్షలు

విజ‌యం ఆయ‌న‌కు ఇంటిపేరు.. విల‌క్ష‌ణత ఆయ‌న‌కు తోడు.. విభిన్న క‌థ‌లు ట్రై చేయ‌డం ఆయ‌న‌కు అల‌వాటు.. టాలీవుడ్ లో ఎంతోమంది హీరోలుండొచ్చు గానీ వెంక‌టేశ్ కు ఉన్న ఇమేజే వేరు. కెరీర్ మొద‌ట్నుంచీ అన్ని ర‌కాల క‌థ‌లు ట్రై చేస్తూ.. ఇమేజ్ చ‌ట్రంలో ఇరుక్కోకుండా జాగ్ర‌త్త ప‌డ్డాడు వెంక‌టేశ్. చిరంజీవి, బాల‌య్య లాంటి స్టార్ హీరోలతో పాటే తాను కూడా సూప‌ర్ స్టార్ గా వెలిగాడు వెంకీ. పైకి క్లాస్ గానే క‌నిపించినా.. వెంక‌టేశ్ కు ఉన్నన్ని రికార్డులు టాలీవుడ్ లో ఏహీరోకు లేవ‌న‌డంలో ఆశ్చ‌ర్యం లేదు.

 

బొబ్బిలిరాజా, చంటి, క‌లిసుందాం రా లాంటి ఆల్ టైమ్ ఇండ‌స్ట్రీ హిట్లు వెంకీ సొంతం. క‌నీసం 50 సినిమాలు చేసిన హీరోల్లో.. దాదాపు 80 శాతం విజ‌యాలున్న ఏకైక ద‌క్షిణాది హీరో వెంక‌టేశ్ మాత్ర‌మే. ఫ్యామిలీ ఆడియ‌న్స్ లో తనకంటూ ఫాలోయింగ్ వుందంటే అది ఈ ద‌గ్గుపాటి సోగ్గాడికి మాత్రమే. నాటి అమాయక చంటి నుంచి.. నేటి పాఠాలు నేర్పే గురు వ‌ర‌కు.. 80ల్లో ప్రేమ నుంచి నిన్న‌టి ఆడ‌వారి మాట‌ల‌కు అర్థాలే వేరులే వ‌ర‌కు.. నాటి స్వ‌ర్ణ‌క‌మ‌లం నుంచి నిన్న‌టి గోపాలా గోపాలా, గురు వ‌ర‌కు.. ఇలా ఒక సినిమాతో మ‌రోదానికి సంబంధం లేకుండా ఎన్నో పాత్ర‌ల‌కు ప్రాణం పోసాడు వెంక‌టేశ్. ఆయ‌న 57వ పుట్టిన‌రోజు నేడు.

 

ఈ పుట్టిన‌రోజు కానుక‌గా వెంకీ నటిస్తున్న మరో కొత్త‌ సినిమా విశేషాలు వెల్లడించారు. గురు తర్వాత వెంక‌టేశ్.. తాజాగా తేజ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇక తాజాగా వెంకీ పుట్టినరోజు కానుకగా హారిక హాసిని సంస్థ మరో సినిమా ప్రకటించింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన బ‌ర్త్ డే లుక్ విడుద‌ల చేసారు. భారీ సినిమాలు నిర్మించిన రాధాకృష్ణ‌.. ప్రొడక్షన్ నంబర్ 6గా సోలోగా వెంకీ సినిమా నిర్మిస్తున్నాడు. త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. తెలుగు ప్రేక్షకులను ఎంతో అలరిస్తున్న వెంక‌టేశ్ ఇలాంటి పుట్టిన‌రోజులు ఇంకెన్నో చేసుకోవాల‌ని ఆసియానెట్ త‌రఫు నుంచి కూడా హ్యాపీ బ‌ర్త్ డే టూ విక్ట‌రీ వెంకీ.

loader