ఒక్కోసారి అభిమానులు చేసే పనులు సెలబ్రిటీలను ఇబ్బంది పెడుతుంటాయి. ఫ్యాన్స్ కారణంగా మన తారలు తలపట్టుకోవాల్సి వస్తుంది. బాలీవుడ్ నటుడు, జాతీయ అవార్డు గ్రహీత విక్కీ కౌశల్ కి కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైందట. ఓ సారి తన ఇంటికి ఓ అమ్మాయి వచ్చిందట.

విక్కీ ఫ్రెండ్ అందుకొని ఆమెని ఇంట్లో కూర్చోబెట్టిందట విక్కీ తల్లి. విక్కీ తనతో రోజూ చాట్ చేస్తాడని, ఇంటికి వచ్చి కలవమన్నాడని అమ్మాయి చెప్పిందట. అప్పట్లో విక్కీ సోషల్ మీడియాలో లేరు. దీంతో వాళ్ల అమ్మకి అనుమానం వచ్చి ఆరా తీసిందట.

అప్పుడు ఆమెకి అసలు విషయం తెలిసిందట. విక్కీ కౌశల్ పేరుతో ఓ వ్యక్తి ఫేక్ ప్రొఫైల్ సృష్టించి చాటింగ్ చేశాడట. దాంతో ఆ అమ్మాయి తనతో చాటింగ్ చేస్తోంది విక్కీ అనుకోని రోజూ మట్లాడేదట. ఓ రోజు ఆ వ్యక్తి ఇంటికి రమ్మని పిలిచాడట. దాంతో విక్కీ రమ్మాన్నాడనుకొని సంబరపడి.. ఆ మరుసటి రోజు ఉదయాన్నే విక్కీ ఇంటికి వెళ్లిపోయింది.

అలా ఆ అమ్మాయి ఇంటికి వచ్చి అందరినీ షాక్ కి గురి చేసిందని విక్కీ తెలిపారు. నటుడిగా 'మసాన్', 'రమణ్ రాఘవ్ 2.0', 'సంజు', 'మన్మర్జియా', 'ఉరీ ది సర్జికల్ స్ట్రయిక్స్' వంటి సినిమాలు విక్కీకి మంచి పేరు తీసుకొచ్చాయి. ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు.