సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ గనుక ఉంటే విడుదలకు చాలా సమయం తీసుకుంటారు. ఆఖరి నిమిషం వరకు అనుకున్న సమయానికి విడుదల చేయగలమా..? లేదా..? అనే టెన్షన్ ఉంటుంది. రిలీజ్ డేట్ అనేది వీఎఫ్ఎక్స్ చేస్తోన్న కంపనీల చేతుల్లోనే ఉంటుంది. వాళ్లు ఫైనల్ అవుట్ పుట్ ఇచ్చేవరకు చెప్పలేం. ఇప్పుడు 'సై రా'కి కూడా ఇలాంటి టెన్షన్ పట్టుకుంది. 

దాదాపు 26 స్టూడియోలలో 'సై రా' వీఎఫ్ఎక్స్ పనులు జరుగుతున్నాయి. ఇందులో ఒక్క స్టూడియో టైం కి అవుట్ పుట్ ఇవ్వకపోయినా రిలీజ్ డేట్ విషయంలో సమస్యలు ఎదురవుతాయి. అక్టోబర్ 2న సినిమాను విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్ చేసింది. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా చేసింది. అయితే అప్పటికి వీఎఫ్ఎక్స్ పనులు పూర్తవుతాయా..? లేదా..? అనే టెన్షన్ మాత్రం 'సై రా' టీమ్ కి చాలానే ఉంది.

అందుకే వీఎఫ్ఎక్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రతీ స్టూడియోకి ఇచ్చిన పని ఎంతవరకు అయిందనే విషయంలో ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. దీనికోసం స్పెషల్ గా ఓ టీమ్ ని కూడా పెట్టుకున్నారు. వీఎఫ్ఎక్స్ లో ఎంత వర్క్ చేసినా సంతృప్తి అయితే ఉండదు. చివరి వరకు మార్పులు చేర్పులు ఉంటాయి. కానీ ఈ సినిమా విషయంలో డెడ్ లైన్ పెట్టుకొని పనులు పూర్తి చేస్తున్నారు.

ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. అనుకోని అవాంతరం ఎదురై.. విడుదల తేదీ మార్చాల్సి వస్తే ఏమిటనే విషయంలో కూడా చిత్రబృందం ఆలోచన చేసుకుంది. కానీ అంతవరకు రాకుండా చిత్రబృందం కష్టపడుతోంది.