లెజండరీ సింగర్ సుశీలహెల్త్ అప్డేట్, క్షేమం
ఆమెను చెన్నైలోని కావేరీ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. వైద్యులు ఆమెకు అన్ని రకాల పరీక్షలు నిర్వహించారు.
కొద్ది రోజుల క్రితం ప్రముఖ సినీ నేపథ్య గాయని, పద్మభూషణ్ గ్రహీత పి.సుశీల (P.Susheela) అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను చెన్నైలోని కావేరి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 88 ఏళ్ల సుశీల గత కొంతకాలంగా వృధ్యాప్య సంభందిత అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆ క్రమంలో ఆమెకు కడుపులో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తీసుకొచ్చి చికిత్స చేసారు. వైద్యులు ఆమెకు అన్ని రకాల పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలో పి.సుశీల ఆరోగ్య పరిస్థితిపై చాలామంది ఆందోళన వ్యక్తం చేశారు.
ఎట్టకేలకు ఆమె హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. చెన్నైలోని తన ఇంటికి చేరుకున్నారు. ఇంటికి చేరుకున్న తర్వాత సుశీల తన అభిమానుల గురించి ఇలా చెప్పుకొచ్చారు. 'ఇప్పుడే నేను ఇంటికి చేరుకున్నారు. పూర్తి ఆరోగ్యంతో వైద్యులు నన్ను ఇంటికి పంపించారు. మీ ప్రార్థనలే నన్ను రక్షించాయి. దేవుడిని నమ్మిన వాడు ఎప్పుడూ చెడిపోడు. నన్ను ఆ భగవంతుడు రక్షించినట్లే మిమ్మల్ని అందరినీ కూడా కాపాడుతాడు .' అని ఆమె కోరుకున్నారు.
క్షేమంగా ఇంటికి చేరుకున్న సుశీల.. అభిమానుల ఆశీస్సులే తనను కాపాడాయని వీడియోలో చెప్పారు. కావేరి ఆస్పత్రిలో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బంది తనను బాగా చూసుకున్నారని ఆమె తెలిపారు. తను ఇంటికి చేరుకున్నానని, వైద్యులు తనను పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేశారని వెల్లడించారు. తన ఆరోగ్యంపై ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపిన ఆమె… తనను అభిమానించే వాళ్లందరికీ ధన్యవాదాలు తెలిపారు.తెలుగుతో పాటు సుమారు పదికి పైగా భాషల్లో 45వేలకు పైగా పాటలు పాడారు. కోట్ల సంఖ్యలు అభిమానులను సుశీల సంపాధించుకున్నారు.