హాస్య నటుడు వడివేలు  పేరు విని చాలా కాలమైంది. ఒకప్పుడు హాస్యనటుడిగా ఓ రేంజిలో  వెలిగిన వడివేలు గత శాసనసభ ఎన్నికలు తర్వాత రకరకాల వివాదాలు కొని తెచ్చుకున్నారు. ఆ తరువాత నటుడు విజయకాంత్‌తో తగువు వల్ల అటు రాజకీయాలకు, ఇటు సినిమాలకు దూరం అయిన పరిస్థితి. కాగా వైగైపులిగా పిలవబడే వడివేలు ఇప్పుడు తన ధోరణిలో మార్పుకు ఆహ్వానం పలుకుతున్నారు.  తనకు రాజకీయాలు వద్దని, ప్రజలను నవ్యించడమే తనకు ఇష్టం అని వడివేలు తేల్చుకున్నారు. అంతేకాదు  నిన్న మొన్నటివరకూ ఓటీటి కోసం ఏదన్నా చేద్దామంటే ఈ  తమిళ కమిడియన్ వడివేలు..నో అన్నారు. తను ఎంత కష్టపడినా పెద్ద తెరమీద కనపడటానికే ..అందుకోసం రెమ్యునేషన్ తగ్గించుకుంటాను కానీ ఓటీటి అనే పదం తన దగ్గర వినిపించవద్దన్నారట.

 దాంతో ఆయన చుట్టూ తిరిగిన ఓటీటి డైరక్టర్స్ ఉసూరుమంటూ వెను తిరిగారు. కానీ లాక్ డౌన్ వచ్చాక..థియోటర్స్ రిలీజ్ పరిస్దితి ఇప్పుడిప్పుడే తేలేటట్లు లేదని తెలిసాక, తన మనస్సు మార్చుకున్నారట. తన చుట్టూ తిరిగిన ఓటీటి వాళ్లకు ఫోన్స్ చేసి మరీ యస్ చెప్పారట. ఆయన త్వరలో ఓ పాపులర్ డైరక్టర్ తో ఓటీటి కోసం ఓ ఫిల్మ్ లేదా వెబ్ సీరిస్ చేయబోతున్నారట. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. ఎప్పుడో 2017లో అదిరింది సినిమాలో కనిపించిన వడివేలు..మళ్లీ తెరపై కనిపించలేదు. 

ఇప్పటికే మూడేళ్లు బ్రేక్ వచ్చింది. ఇంక తనను జనం మర్చిపోతారని, తను కాల గర్బంలో కలిసిపోతానని తెలిసే ఈ నిర్ణయం తీసుకున్నాడంటున్నారు. లాక్ డౌన్ ఎత్తేసాక వడివేలు కు సంభందించిన ఆ ప్రాజెక్టు ప్రారంభం కానుందిట. అందులో వడివేలు హీరో అని చెప్తున్నారు. పూర్తి ఫన్ తో సాగే సబ్జెక్ట్ తో వడివేలు ఓటీటిలో ఎంట్రీ ఇవ్వబోతున్నారట. ఈ మేరకు ఆయన ఇన్ పుట్స్ ఇస్తూ స్క్రిప్టు రెడీ చేయిస్తున్నారట.