చెన్నైలోని వలసరవాక్కంలో నివాసం ఉంటున్న రాజశేఖర్ ఇటీవల అస్వస్థత కారణంగా స్థానికరామచంద్ర ఆసుపత్రిలో చేరారు. అక్కడే చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. 

ప్రముఖ దర్శకుడు, సీనియర్ నటుడు రాజశేఖర్ అనారోగ్యం కారణంగా మృతిచెందారు. ఆయన వయసు 62 ఏళ్లు. చెన్నైలోని వలసరవాక్కంలో నివాసం ఉంటున్న రాజశేఖర్ ఇటీవల అస్వస్థత కారణంగా స్థానికరామచంద్ర ఆసుపత్రిలో చేరారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

అక్కడే చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. ఈరోజు అంత్యక్రియలు జరపనున్నారు. ఆయన మరణవార్త విన్న పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. దర్శకుడిగా తమిళ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన రాజశేఖర్ ఆ తరువాత నటుడిగా మారారు.

భారతీరాజా దర్శకత్వంలో రూపొందిన 'నిళల్ గల్' చిత్రంలోఒక హీరోగా రాజశేఖర్ నటించారు. 'ఇదు ఒరు పొన్ మాలై పొళుదు..' అనే పాట ద్వారా అందరికీ సుపరిచితుడయ్యాడు. 'పలైవనచోలై', 'చిన్నపూవే మెల్ల పెసు' తదితర చిత్రాలకు దర్శకత్వం వహించారు.