బాజీగర్, 36 చైనా టౌన్‌, ఖిలాడీ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన బాలీవుడ్ సీనియర్ నటుడు, ప్రద్మశ్రీ అవార్డు గ్రహీత దిన్యార్ కాంట్రాక్టర్(79)మృతి చెందారు.

వయసు రీత్యా వచ్చిన ఆరోగ్య సమస్యల కారణంగా ఆయన మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. హిందీ, గుజరాతీ సినిమాలతో పాటు పలు టీవీ షోలలో కూడా ఆయన నటించారు.

నటన మీద ఆసక్తితో చదువుకునే రోజుల్లోనే రంగస్థల నటుడిగా కెరీర్ ఆరంభించిన ఆయన 1966 నుండి సినిమాల్లో నటిస్తున్నారు. సినిమా రంగానికి ఆయన చేసిన సేవలకు 2019లో భారత ప్రభుత్వం ఆయన్ని పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ఆయన మరణ వార్త విన్న ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.