ప్రముఖ బెంగాలీ సీనియర్ నటుడు చిన్మయ్ రాయ్(79) తుదిశ్వాస విడిచారు. కోల్‌కతాలోని సాల్ట్ లేక్ లో గల ఆయన స్వగృహంలో ఆదివారం నాడు రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో ఆయన గుండెపోటుతో మరణించినట్లు తెలుస్తోంది.

నటి జుయూ బెనర్జీని ప్రేమ వివాహం చేసుకోగా.. కొన్నేళ్ల క్రితం ఆమె కాలం చేశారు. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. బంగ్లాదేశ్ పరిధిలోకి వచ్చే కుమిల్ జిల్లాలో 1940లో జన్మించారు.

తనకు ఇరవై ఏళ్ల వయసులోనే సినీ కెరీర్ ని ఎన్నుకున్నాడు. పలు బెంగాలీ చిత్రాలలో కమెడియన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేశారు.