గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 51 వ ఎడిషన్‌లో భాగంగా ప్రముఖ నటుడు, నిర్మాత, దర్శకుడు, గాయకుడు విశ్వజిత్ ఛటర్జీని ఇండియన్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపిక చేసింది.

ఫెస్టివల్ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ అవార్డును కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ ప్రకటించారు. మార్చి 2021 లో జాతీయ చలన చిత్ర పురస్కారాలను ప్రదానం సందర్భంగా ఈ అవార్డును విశ్వజిత్‌కు అందజేస్తామని జవదేకర్ వెల్లడించారు. 

బీస్ సాల్ బాద్‌లో కుమార్ విజయ్ సింగ్, కోహ్రాలో రాజా అమిత్ కుమార్ సింగ్, ఏప్రిల్ ఫూల్ లో అశోక్, మేరే సనమ్ లో రమేష్ కుమార్, లండన్ లో నైట్ లో జీవన్, దో కాలియాన్ లో శేఖర్, కిస్మాట్ లో విక్కీ పాత్రలకు గాను విశ్వజిత్ గుర్తింపు తెచ్చుకున్నారు .

బాలీవుడ్ నటీమణులు ఆశా పరేఖ్, వహీదా రెహ్మాన్, ముంతాజ్, మాలా సిన్హా, రాజ శ్రీ వంటి వారితో ఆయన జత కట్టారు. చౌరింఘీ (1968), గర్ నాసింపూర్, ఉత్తమ్ కుమార్, కుహేలి, శ్రీమాన్ పృథ్వీరాజ్ (1973), జై బాబా తారక్‌నాథ్ (1977), అమర్ గీతి (1983) వంటి బెంగాలీ చిత్రాల్లో కూడా ఆయన నటించారు. 1975 లో, విశ్వజిత్ సొంతంగా కహతే హై ముజ్కో రాజా నిర్మించి, దర్శకత్వం వహించారు.