టాలీవుడ్ లో తెరకెక్కిన రెండు పాన్ ఇండియా చిత్రాలు వాయిదా పడ్డాయి. జనవరి 7న విడుదల కావాల్సిన ఆర్ ఆర్ ఆర్ మూవీ ఆగిపోయింది.ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ (RRR Movie)అనుకున్న సమయం కంటే ఏడాది దాటిపోయింది. 

2022 సంవత్సరం వస్తూ వస్తూనే గడ్డు పరిస్థితులను పరిచయం చేస్తుంది. దేశంలో కరోనా కేసులు రెండు రోజుల వ్యవధిలో లక్ష దాటిపోయాయి. ఒమిక్రాన్ అంటూ కొత్త వేరియంట్ హడల్ పుట్టిస్తుంది. రోగుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో చిత్ర పరిశ్రమకు ఇబ్బందికర పరిస్థితులు మొదలయ్యాయి. భాషా బేధం లేకుండా స్టార్ హీరోల సినిమాలన్నీ వాయిదా పడ్డాయి. పెద్ద పండగ సంక్రాంతికి సందడి చేస్తాయనుకుంటే... నిరాశ మిగిల్చాయి. 

టాలీవుడ్ లో తెరకెక్కిన రెండు పాన్ ఇండియా చిత్రాలు వాయిదా పడ్డాయి. జనవరి 7న విడుదల కావాల్సిన ఆర్ ఆర్ ఆర్ మూవీ ఆగిపోయింది.ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ (RRR Movie)అనుకున్న సమయం కంటే ఏడాది దాటిపోయింది. జోరుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించి, భారీ ఎత్తున విడుదల చేయాలనుకున్న ఆర్ ఆర్ ఆర్ మేకర్స్ ఆశలు అడియాశలయ్యాయి. అలాగే జనవరి 14న ప్రభాస్ రాధే శ్యామ్ విడుదల కావల్సి ఉంది. ఈ మూవీ సైతం వాయిదా పడింది. 

రాధే శ్యామ్ (Radhe Shyam)కూడా పాన్ ఇండియా మూవీగా ఐదు భాషల్లో విడుదల కావాల్సి ఉంది. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా ఆంక్షలు అమలులోకి తెచ్చాయి.ఢిల్లీలో థియేటర్స్ పూర్తిగా మూసివేయగా.. తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటకతో పాటు ఆంధ్ర రాష్ట్రంలో యాబై శాతం ఆక్యుపెన్సీకి మాత్రమే అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే నైట్ కర్ఫ్యూలు కూడా ప్రకటించారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల మధ్య భారీ బడ్జెట్ చిత్రాలు విడుదల సాధ్యం కాదు. 

మరోవైపు అన్ని పరిశ్రమలకు చెందిన ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. మన టాలీవుడ్ లో రోజుల వ్యవధిలో మంచు మనోజ్, లక్ష్మి,త్రిష, మహేష్ బాబు (Mahesh Babu)కు కరోనా సోకింది. వీరితో పాటు మరికొంత మంది కరోనా సోకి చికిత్స తీసుకుంటున్నారు. ఇక నిన్న టాలీవుడ్ లో అతిపెద్ద విషాదం చోటు చేసుకుంది. మహేష్ అన్నగారైన రమేష్ బాబు(Ramesh babu) అకాల మరణం పొందారు. 56ఏళ్లకే రమేష్ బాబు అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. 

ఒకవైపు కరోనా సోకిన మహేష్ కడసారి అన్నయ్యను చూసుకోలేని పరిస్థితి. తోడబుట్టిన, తనతో కలిసి సినిమాలు చేసిన అన్నయ్య మరణం ఆయనను కలచి వేస్తుంది. భౌతికకాయాన్ని సందర్శించే అవకాశం లేకపోవడంతో మరింత కృంగిపోతున్నారనడంలో సందేహం లేదు. 2020, 2021 ఒకింత పర్వాలేదనిపించాయి. 2022 సంవత్సరం మాత్రం ఆరంభం నుండే సినిమా చూపిస్తుంది. ఇక రానున్న 11 నెలల కాలం ఎలా గడవనుందో అన్న భయం వేస్తుంది. 

చిత్ర పరిశ్రమలో అనేక భారీ, మధ్య తరహాగా బడ్జెట్ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. కరోనా పరిస్థితులు కొనసాగిన నేపథ్యంలో ఆంక్షలు అమలులో ఉంటాయి. మరి ఆంక్షల మధ్య పెద్ద చిత్రాల విడుదల కుదిరేపని కాదు. థియేటర్స్ లో యాభై శాతం ఆక్యుపెన్సీకి మాత్రం అనుమతి ఉంటే, బడా సినిమాల వసూళ్లు తీవ్రంగా ఎఫెక్ట్ అవుతాయి. దీనితో కరోనా ప్రభావం తగ్గి సాధారణ పరిస్థితులు ఏర్పడాలని అందరూ కోరుకుంటున్నారు.