తాజాగా వెలువడిన  అసెంబ్లీ  ఎన్నికల ఫలితాల్లో ఎవరూ ఊహించని విధంగా ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించింది.  ఈ నేపథ్యంలో తన ప్రెడిక్షన్ తప్పు అయిందంటూ ఓ వీడియో వదిలాడు వేణు స్వామి.

ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఆయన జాతకాలు చెప్పడం మానేస్తున్నట్లు చెబుతూ వీడియో రిలీజ్ చేశాడు. ప్రస్తుతం వేణు స్వామి వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే .. జ్యోతిష్యుడు వేణు స్వామి రాజకీయాలు, సినిమాలు వంటి వాటి గురించి ప్రెడిక్షన్స్ చెబుతుంటాడు. అయితే ఏపీలో ఎన్నికల నేపథ్యంలో వైసీపీ పార్టీ భారీ మెజార్టీతో గెలుపు సాధిస్తుందని ఆయన అన్నారు. 

జగన్ మోహన్ రెడ్డి మళ్లీ సీఎం అవుతాడని బల్లగుద్ది మరీ చెప్పుకొచ్చాడు. ఈ విషయం పై టీడీపీ నేతలు వేణు స్వామిని దారుణంగా ట్రోల్ చేశారు. అయితే తాజాగా వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎవరూ ఊహించని విధంగా ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో తన ప్రెడిక్షన్ తప్పు అయిందంటూ ఓ వీడియో వదిలాడు వేణు స్వామి. ''ఎన్నికల వేళ దేశవ్యాప్తంగా అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్టానికి సంబంధించి నేను ప్రెడిక్షన్ చెప్పాను. 

నేను ఇచ్చిన ప్రెడిక్షన్ లో నరేంద్ర మోదీ ప్రభావం తగ్గుతుంది అని చెప్పాను. అలాగే ఆంధ్రప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డి గారు గెలుస్తారు అని చెప్పాను. నాకున్న విద్యను అనుసరించి నేను చెప్పాను. నేను చెప్పిన దాంట్లో సెంట్రల్ మోదీ ఆధిపత్యం అనేది తగ్గింది. అది ఒకటి జరిగింది. రెండోది ఆంధ్రప్రదేశ్ లో జగన్ గెలుస్తారు అన్నాను అది తప్పింది. జనరల్ గా జాతకాన్ని బేస్ చేసుకుని మాత్రమే నేను ప్రెడిక్షన్ చెప్పాను. చాలా రోజుల నుంచి నన్ను విమర్శించిన వాళ్ళు, ట్రోల్ చేసిన వాళ్ళు ఒక లక్ష్యంగా అది చేశారు. 

సో .. ఈ రోజు నేను చెప్పినటువంటి ప్రెడిక్షన్ 100 శాతం తప్పు అయింది. దీన్ని కచ్చితంగా నేను ఒప్పుకుంటున్నాను. నేను చెప్పింది వ్యతిరేకంగా జరిగింది. వైసీపీ ఓడిపోయింది .. చంద్రబాబు నాయుడు గారు గెలిచారు. నేను చెప్పింది తప్పయింది కాబట్టి నేను ఒక నిర్ణయం తీసుకున్న. ఈ రోజు నుంచి రాజకీయపరమైన, సినిమా పరిశ్రమకు సంబంధించిన ఎటువంటి ప్రెడిక్షన్స్ ఇంటర్వ్యూల్లో, సోషల్ మీడియాలో చెప్పడం మానేస్తున్న. పబ్లిక్ ప్లాట్ ఫార్మ్ లో ఎవరి వ్యక్తిగత జాతకాన్ని నేను విశ్లేషించను అంటూ చెప్పుకొచ్చారు.