నాగ్  కెరీర్‌లోనే స్పెషల్ చిత్రం 'మన్మథుడు' . ఆ సినిమా ఎంత పెద్ద  హిట్  అయ్యింది అనేదాని కన్నా ఎంత బాగా జనాల్లోకి వెళ్లి నిలిచిపోయిందనేది సీక్వెల్ యుఎస్ పి గా మారింది. చాలా మంది ఈ సినిమాని కామెడీ పరంగా  క్లాసిక్ గా చెప్తూంటారు. ముఖ్యంగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అందించిన డైలాగులు సినిమాకు ప్లస్ అయ్యాయి. 

అలాగే హాస్యబ్రహ్మ బ్రహ్మానందం కామెడీ సినిమాకు హైలైట్‌గా నిలిచింది. మన్మథుడు చిత్రంలో లవంగం పాత్రలో బ్రహ్మానందం తెగ నవ్వించారు. దాంతో ఇప్పుడు మన్మధుడు 2 తీస్తున్నారనగానే లవంగం పాత్ర ఎవరు చేస్తున్నారంటూ చర్చ మొదలైంది. 

అందుతున్న సమాచారం మేరకు ఆ పాత్రను యువ హాస్య నటుడు వెన్నెల కిషోర్ పోషించనున్నాడు. వెన్నెల కిషోర్, రాహుల్ రవీంద్రన్ మధ్య స్నేహం తెలియంది కాదు. ఆ స్నేహామే ఈ చిత్రంలో వెన్నెలకు కీలక పాత్రను ఇచ్చేలా చేసిందని అనుకుంటున్నారు. 

వెన్నెల కిషోర్ పాత్ర నాగ్ కు సైడ్ కిక్ గా ఉంటుందని, పూర్తగా నాగ్ తో ఉంటే క్యారక్టర్ అని, యూరప్ షెడ్యూల్ నుంచి సెట్స్ కు జాయిన్ అవుతాడు అంటున్నారు.

ఈ నేపధ్యంలో  బ్రహ్మనందాన్ని వెన్నెల కిషోర్ మరిపించే  విధంగా నటిస్తాడా...అనే సందేహాలు చాలా మందిలో కలుగుతున్నాయి.  అయితే బ్రహ్మీ అభిమానులు మాత్రం ఆయన్ని  మ్యాచ్ చేయడం ఎవరితరం కాదంటున్నారు. ఆ పాత్రకు బ్రహ్మీనే తీసుకుంటే బాగుండేది అని సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. అలాగే  త్రివిక్రమ్‌‌ను తలపించే విధంగా రాహుల్ డైలాగులు ఉంటాయో లేదో వేచిచూడాల్సిందే అంటున్నారు. ఏదైమైనా రాహుల్ రవీంద్రన్ కు ఇది పెద్ద టాస్కే. 

నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని నాగార్జునే స్వయంగా అన్నపూర్ణా స్టూడియోస్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.