దక్షిణాది అగ్ర దర్శకుడు శంకర్ రూపొందించిన '2.0' సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ దక్కించుకుంది. శంకర్ తన తదుపరి సినిమాను కమల్ హాసన్ హీరోగా 'భారతీయుడు2' సినిమాను రూపొందించబోతున్నాడు.

వచ్చిన 'భారతీయుడు' సినిమాకు ఇది సీక్వెల్ గా తెరకెక్కిస్తున్నారు. డిసంబర్ నుండి ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. శంకర్-కమల్ కాంబినేషన్ కావడంతో తమిళంలో మాత్రమే కాకుండా ఇతర భాషల్లో కూడా ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

దీంతో శంకర్ రూట్ మార్చి ఇతర భాషలకు చెందిన నటీనటులను కూడా ఎంపిక చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా తెలుగు నుండి కమెడియన్ వెన్నెల కిషోర్ కి ఈ సినిమాలో చోటు దక్కిందని తెలుస్తోంది. ఇటీవల '2.0' సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న శంకర్ ఈ విషయాన్ని ప్రస్తావించారు.

అలానే కన్నడ, మలయాళ, హిందీ చిత్రసీమల నుండి కూడా నటీనటులను ఎంపిక చేసుకుంటున్నారట. శంకర్-కమల్ కాంబినేషన్ పైగా భారతీయుడు సినిమాకు సీక్వెల్ కావడంతో ఇది వెన్నెల కిషోర్ కి మంచి ఛాన్స్ అనే చెప్పాలి.

ఇప్పటివరకు తన కామెడీ టైమింగ్ తో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన వెన్నెల కిషోర్ ఇప్పుడు తమిళ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటాడో చూడాలి!