2019 వరల్డ్ కప్ ఫైట్ జోరుగా సాగుతోంది. ప్రతి టీమ్ ప్రత్యర్థి జట్టుతో నువ్వా నేనా అనే రేంజ్ లో పోట్లాడుతున్నాయి. ఇక ప్రపంచంలో ఉన్న చాలా మంది భారతీయులు ఇండియా మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నారు. వారిలో సూపర్ స్టార్ మహేష్ - విక్టరీ వెంకటేష్ లు కూడా ఉన్నారు. 

సినీ ప్రపంచాన్ని పక్కనెట్టి కొన్ని రోజులు హాలిడేస్ ని ఎంజాయ్ చేయాలనీ అనుకున్న మహేష్ పనిలో పనిగా తనకు ఇష్టమైన క్రికెట్ ని కూడా ఆస్వాదించనున్నాడు. వెంకీ క్రికెట్ ని ఎంతగా ఇష్టపడతాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఈ నెల 9న లండన్ లో జరగబోయే ఆస్ట్రేలియా - ఇండియా మ్యాచ్ ను ఈ ఇద్దరు హీరోలు ఫ్యామిలీస్ తో కలిసి వీక్షించనున్నారు. 

ప్రస్తుతం వెంకటేష్ వెంకీ మామ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక మహేష్ హాలిడేస్ ట్రిప్ అయిపోగానే సరిలేరు నీకెవ్వరు! సినిమాను మొదలుపెట్టనున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించనుంది.