వరుస అపజయాలతో సతమతమవుతున్న నితిన్ ఈ సారి నెక్స్ట్ సినిమాతో పర్ఫెక్ట్ హిట్ కొట్టాలని ట్రై చేస్తున్నాడు. ఛలో దర్శకుడు వెంకీ కుడుముల చెప్పిన బీష్మ కథను మెచ్చిన నితిన్ త్వరలోనే ఆ సినిమాను ప్రేక్షకుల ముందుకు తేనున్నాడు. అయితే ఈ సినిమాపై గత కొన్ని రోజులుగా అనేక రకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. 

హీరోయిన్ రష్మిక మందన్న ను ఇదివరకే సెలెక్ట్ చేసిన చిత్ర యూనిట్ మరో హీరోయిన్ కోసం సెర్చ్ చేస్తున్నట్లు రూమర్స్ వినిపించాయి. కొన్ని మీడియాలో అయితే దాదాపు సెకండ్ హీరోయిన్ ఖరారయినట్లు కథనాలు కూడా వచ్చాయి. ఇక ఈ విషయంపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వక తప్పలేదు. 

సినిమాలో మెయిన్ హీరోయిన్ గా రశ్మిక మందన్న నటిస్తోందని చెబుతూ.. త్వరలో మిగతా నటీనటుల వివరాలు అలాగే టెక్నీషియన్స్ గురించి తెలియజేస్తామని వెంకీ సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చాడు. దీంతో నితిన్ అభిమానుల్లో సినిమా పై ఒక క్లారిటి వచ్చినట్లయ్యింది. సీతారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మరికొన్ని రోజుల్లో మొదలుకానుంది.