వెంకీ ‘దృశ్యం 2’ రిలీజ్ డేట్ ..ఆ రోజే ఫిక్స్?
ఇటీవలే మలయాళంలో తెరకెక్కిన ‘దృశ్యం2’ ప్రముఖ ఓటీటీ ఆమెజాన్‌లో విడుదలై విమర్శకుల ప్రసంశలు అందుకుంది. పార్ట్-3కి కూడా డైరెక్టర్ జీతూ స్క్రిప్ట్‌ను మలిచే పనిలో ఉన్నట్టు ఇటీవలే వెల్లడించారు. మరోవైపు వెంకీ నటించిన ‘నారప్ప’తో పాటు ‘ఎఫ్3’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది
మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్. ఆయన కీలక పాత్రలో 2013లో వచ్చిన సూపర్‌హిట్ ఫిల్మ్ ‘దృశ్యం’. థ్రిల్లర్ మూవీగా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా, ఇతర భాషల్లోనూ కాసుల వర్షాన్ని కురిపించింది. దానికి కొనసాగింపుగా వచ్చిన తాజా చిత్రం ‘దృశ్యం2’. తాజాగా అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదలైంది. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తాజాగా ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే.
వెంకటేశ్-మీనా జంటగా రానున్న ఈ చిత్రానికి మాతృకను తెరకెక్కించిన జీతూ జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ చేస్తూ.. ఏప్రియల్ నెలాఖరకు పూర్తి చేయాలని ప్లాన్ చేసారు. జూన్ 20 న ఈ చిత్రం ఇంటర్నేషనల్ ఫాదర్ డే న రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. తండ్రి,కూతుళ్లు అనుబంధం చుట్టూ తిరిగే సినిమా కాబట్టి ఆ రోజున రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు వినపడుతోంది. అయితే అఫీషియల్ గా ఈ డేట్ ని లాక్ చేసినట్లు ప్రకటన ఏమీ రాలేదు.
ఇక ఈ సీక్వెల్ చిత్రంలో ...వరుణ్ కనిపించకుండా పోయిన కేసు నుంచి బయటపడిన వెంకటేష్ ,మీనా కుటుంబం ఉన్నత జీవితాన్ని గడుపుతూ ఉంటుంది. కేబుల్ టీవీ ఆపరేటర్ స్థాయి నుంచి థియేటర్ ఓనర్‌గా, ఓ సినిమాను నిర్మించే స్థాయికి ఎదుగుతాడు వెంకటేష్. అయితే వరుణ్ కేసు తాలూకు భయాలు మాత్రం ఆయన కుటుంబాన్ని వెంటాడుతూనే ఉంటాయి. మరోవైపు వరుణ్‌ను వెంకటేషే చంపి ఉంటాడని ఊళ్లో చాలా మంది అనుకుంటూ ఉంటారు. పోలీసులకు అదే అనుమానం ఉన్నా, ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో ఆ కేసును సీక్రెట్‌గా విచారిస్తుంటారు. అదే సమయంలో ఐజీ ఆ కేసును రీఓపెన్ చేస్తాడు. అప్పుడు వెంకటేష్ ఏం చేశాడు? కేసు రీఓపెన్‌తో వెంకటేష్ భార్య, పిల్లలు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు? ఈ కేసు నుంచి బయటపడ్డారా?కుటుంబం కోసం దాన్ని వెంకటేష్ ఎలా అధిగమించాడు? అనే విషయాలు చుట్టూ కథ తిరుగుతుంది.
ఇటీవలే మలయాళంలో తెరకెక్కిన ‘దృశ్యం2’ ప్రముఖ ఓటీటీ ఆమెజాన్‌లో విడుదలై విమర్శకుల ప్రసంశలు అందుకుంది. పార్ట్-3కి కూడా డైరెక్టర్ జీతూ స్క్రిప్ట్‌ను మలిచే పనిలో ఉన్నట్టు ఇటీవలే వెల్లడించారు. మరోవైపు వెంకీ నటించిన ‘నారప్ప’తో పాటు ‘ఎఫ్3’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది
వెంకటేష్, మీనా జంటగా గతంలో వచ్చిన మలయాళీ రీమేక్ చిత్రం ‘దృశ్యం’ ఎంత ఘన విజయం సాధించిందో తెలిసిందే. తాజాగా ‘దృశ్యం-2’ని ఇదే కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్నారు. మొదటి భాగానికి శ్రీప్రియ దర్శకత్వం వహించగా ప్రస్తుత సీక్వెల్‌కు మాతృక దర్శకుడు జీతూ జోసెఫ్ మెగాఫోన్ పట్టనున్నారు. కొవిడ్ ప్రభావం ఇంకా తగ్గని కారణంగా పరిమిత సిబ్బందితోనే షూటింగ్ చేస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.