Asianet News TeluguAsianet News Telugu

స్టేజిపై దేవిశ్రీప్రసాద్ కు 'సారీ' చెప్పిన ‘రంగ్ దే’ డైరక్టర్

భీష్మ తో సూపర్ హిట్ అందుకున్న నితిన్ తదుపరి చిత్రం రంగ్ దే మార్చ్ 26 న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో నితిన్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుండగా పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తొలిప్రేమ’, ‘మిస్టర్ మజ్ను’ చిత్రాల దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన చిత్ర ట్రైలర్ మరియు పాటలు సూపర్ హిట్ అయ్యాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి గ్రాండ్ రిలీజ్ ఈవెంట్ ని రాజమహేంద్రవరం లోని బుధవారం సాయంత్రం ఘనంగా జరిగింది. ఈ నేపధ్యంలో రంగ్ దే గ్రాండ్ రిలీజ్ ఈవెంట్ లో రంగ్ దే డైరెక్టర్ వెంకీ అట్లూరి మట్లాడుతూ..దేవి కు సారీ చెప్పారు. ఎందుకో చూద్దాం.

Venky Atluri says sorry to Rang de movie director jsp
Author
Hyderabad, First Published Mar 25, 2021, 11:06 AM IST

భీష్మ తో సూపర్ హిట్ అందుకున్న నితిన్ తాజా చిత్రం రంగ్ దే మార్చ్ 26 న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో నితిన్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుండగా పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తొలిప్రేమ’, ‘మిస్టర్ మజ్ను’ చిత్రాల దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన చిత్ర ట్రైలర్ మరియు పాటలు సూపర్ హిట్ అయ్యాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి గ్రాండ్ రిలీజ్ ఈవెంట్ ని రాజమహేంద్రవరం లోని బుధవారం సాయంత్రం ఘనంగా జరిగింది. ఈ నేపధ్యంలో రంగ్ దే గ్రాండ్ రిలీజ్ ఈవెంట్ లో రంగ్ దే డైరెక్టర్ వెంకీ అట్లూరి మట్లాడుతూ..దేవి కు సారీ చెప్పారు. ఎందుకో చూద్దాం.
 
 వెంకీ అట్లూరి మట్లాడుతూ....రాజ‌మండ్రికి నాకు అనుబంధం వుంది. ఫ‌స్ట్ టైమ్ ఈవెంట్ ఇక్క‌డ జ‌ర‌గ‌డం..చాలా ఆనందంగా వుంది. బేసిగ్గా ల‌వ్‌స్టోరీసే చేయాల‌న్న‌ది నా అభిమ‌తం కాదు. జ‌స్ట్ ఇది యాదృచ్ఛికంగా జ‌రిగింది. రంగ్ దే అనేది ఇద్ద‌రు వ్య‌క్తుల ప్రేమ‌క‌థ మాత్ర‌మే కాదు. రంగ్ దే అని పెట్ట‌డానికి కార‌ణం ఏంటంటే హోళీ ఆడితే ర‌క‌ర‌కాల క‌ల‌ర్ల‌ని ఒకేసారి ముఖం మీద కొడ‌తాం. అలాగే ఈ సినిమాలో కూడా ర‌క‌ర‌కాల ఎమోష‌న్స్ ఒక స్ప్లా‌ష్ కింద వ‌స్తే ఎంత హ్యాపీగా ఫీల‌వుతామో అంత చ‌క్క‌గా వుంటుందీ సినిమా.

 ప్రామిస్‌గా చెబుతున్నాను.. నితిన్‌గారు కామెడీ నిజంగా అద‌ర‌గొట్టేశారు. కీర్తిగారిని ఎంత ఏడిపిస్తారో.. త‌రువాత ఆమె అంత ప‌గ తీర్చుకుంటారు. ఈవిడ మామూలు మ‌నిషి కాదు. ఖ‌చ్చితంగా ఈ సినిమా మిమ్మ‌ల్ని ఎంట‌ర్‌టైన్ చేస్తుంది. దేవిగారి విష‌యంలో త‌ప్పు చేశాను. అందుకు అంద‌రి ముందు పారీ చెబుతున్నాను. బస్టాండే.. బ‌స్టాండే. పాట ఎంతో పెద్ద హిట్టయింది. అందరికి న‌చ్చింది. అయితే ఈ పాట ముందు విన్న‌ప్పుడు సార్ ఇది అంటూ న‌సిగాను. వెంట‌నే దేవిగారు మీకు మైండ్ వుందా? అని తిట్టి ఈ సాంగ్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అవుతుంద‌ని ఈ సాంగ్ పెడ‌దాం అని న‌న్ను క‌న్విన్స్ చేశారు. ఆ పాట రిలీజైన ద‌గ్గ‌రి నుంచి మిలియ‌న్స్ వ్యూస్‌ని దాటేస్తోంది. ఈ సంద‌ర్భంగా దేవిగారికి సారీ చెబుతున్నాను.అన్నారు.  

ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇటీవల విడుదలైన పాటలు సంగీత ప్రియులను మరింత  ఆకట్టుకున్నాయి. డీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దిగ్గజ సినిమాటోగ్రాఫర్ పి.సి.శ్రీరామ్ ఈ సినిమాకు కెమెరామన్‌గా పనిచేస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రచారంలో భాగంగా… నితిన్, కీర్తి సురేష్, వెంకీ అట్లురితో సహా చిత్రయూనిట్ విభిన్నంగా ట్రై చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‏లో నితిన్, కీర్తి సురేష్ టామ్ అండ్ జెర్రీలా కొట్లాడుకుంటూ కనిపించారు. కేవలం రీల్‏లో మాత్రమే కాకుండా.. రియల్ లైఫ్‏లోనూ వీరిద్ద

Follow Us:
Download App:
  • android
  • ios