Asianet News TeluguAsianet News Telugu

సైలెంట్‌గా వెంకటేష్‌ కూతురు ఎంగేజ్‌మెంట్‌.. హాజరైన చిరంజీవి, మహేష్‌బాబు, సెలబ్రిటీలు..

హీరో వెంకటేష్‌ ఇప్పటికే పెద్ద కూతురు పెళ్లి చేశాడు. ఇప్పుడు మరో కూతురు వివాహం చేయబోతున్నారు. తాజాగా బుధవారం ఎంగేజ్‌మెంట్‌ నిర్వహించారు. ఆ ఫోటో వైరల్‌ అవుతుంది.

venkatesh second daughter engagement chiranjeevi maheshbabu many celebraties attended arj
Author
First Published Oct 25, 2023, 9:32 PM IST | Last Updated Oct 25, 2023, 10:55 PM IST

హీరో దగ్గుబాటి వెంకటేష్‌.. ఇప్పటికే తన పెద్ద కుమార్తె వివాహం చేశారు. ఇప్పుడు రెండో కుమార్తె వివాహానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే చాలా సైలెంట్‌గా దగ్గుబాటి ఫ్యామిలీ ఈ వివాహ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వెంకటేష్‌ రెండో కూతురు హయవాహిని పెళ్లి సెట్‌ అయ్యింది. తాజాగా ఎంగేజ్‌మెంట్‌ కూడా జరిగింది. నేడు విజయవాడలో వెంకటేస్‌రెండో కూతురు నిశ్చితార్థం జరిగింది. తాజాగా దీనికి సంబంధించిన ఓ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. 

విజయవాడకి చెందిన ప్రముఖ డాక్టర్‌ కుటుంబంతో వెంకటేష్‌ వియ్యం అందుకుంటున్నారట. వీరి ఎంగేజ్‌మెంట్‌ బుధవారం జరిగిందని తెలుస్తుంది. అయితే పెద్దగా ప్రచారం లేకుండా సైలెంట్‌గా ఈ వేడుకని నిర్వహిస్తుండటం విశేషం. ఇక వెంకీ రెండు కూతురు ఎంగేజ్‌మెంట్‌కి సినీ ప్రముఖులు హాజరు కావడం విశేషం. మెగాస్టార్‌ చిరంజీవి, సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు ఈ ఫోటోలో కనిపిస్తున్నారు. వెంకటేష్‌.. మహేష్‌ని పట్టుకుని వచ్చినందుకు థ్యాంక్స్ చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్‌ అవుతుంది. 

వెంకటేష్‌ తన ఫ్యామిలీ వ్యవహారాలన్నీ చాలా ప్రైవేట్‌గా ఉంచుతారు. ఏదీ బయటకు రానివ్వరు. ఇప్పుడు ఈ మ్యారేజ్‌ విషయం కూడా మీడియాకి పొక్కకుండా జాగ్రత్త పడ్డారు. కానీ ఒక్క ఫోటో అంతా లీక్‌ చేసేసింది. ఇక నాలుగేండ్ల క్రితం వెంకీ.. తన పెద్ద కూతురు వివాహం చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌ రేస్‌ క్లబ్‌ హోనర్‌ సురేందర్‌రెడ్డి మనవడు వినాయక్‌ రెడ్డితో మ్యారేజ్‌ జరిగింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios