ఆస్ట్రేలియా గడ్డపై భారత్ టెస్ట్ సిరీస్‌ని 2-1 తేడాతో గెలుపొందడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. రాజకీయ, క్రీడా దిగ్గజాలు ఈ ఘనతని కొనియాడుతున్నారు. సినీ తారలు సైతం స్పందించి టీమిండియాకి అభినందనలు తెలియజేస్తున్నారు. వెంకటేష్‌, పవన్‌ కళ్యాణ్‌, అమితాబ్‌ బచ్చన్, షారూఖ్‌ ఖాన్‌, అక్షయ్‌ కుమార్‌, రణ్‌ వీర్‌ సింగ్‌, కరణ్‌ జోహార్‌ ఇలా ప్రతి ఒక్కరు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇది చారిత్రక విజయంగా అభివర్ణిస్తున్నారు. 

వెంకటేష్‌ స్పందిస్తూ, ఈ రోజు జరిగిన ఇండియా వర్సెస్‌ ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా అద్భుతమైన విజయం సాధించడం చారిత్రాత్మకం, గర్వకారణం. జట్టుకి అభినందనలు. వెల్‌ డన్‌ అబ్బాయిలు` అని తెలిపారు. 

పవన్‌ కళ్యాణ్‌ ప్రకటనలో పేర్కొంటూ, `భారత క్రికెట్‌ జట్టు ఆస్ట్రేలియాపై ఆ దేశంలోనే టెస్ట్ సిరీస్‌ సాధించడం చారిత్రాత్మకం. బ్రిస్బేన్‌ మైదానంలోని టెస్టులో గెలిచిన తీరు ఓ అద్భుతం. ఈ ఘనత సాధించిన మన క్రికెట్‌ జట్టుకు నా తరఫున, జనసేన తరఫున అభినందనలు తెలియజేస్తున్నా. ప్రతికూల పరిస్థితుల్లో సాధించిన విజయం యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తుంది. కీలక ఆటగాళ్లు గాయాల పాలైనా అంతరా్జతీయ వేదికలపై తొలి అడుగులు వేస్తున్న క్రీడాకారులు చూపిన ప్రతిభ, కలసికట్టుగా విజయం కోసం పోరాడిన విధానం ప్రశంసనీయం అన్నారు. 

అసాధారణమైన విజయమిది` అని అమితాబ్‌ బచ్చన్‌ అన్నారు. `మా జట్టుకి ఎంత అద్భుతమైన విజయం. బంతి ద్వారా బంతిని విప్పడం చూడటానికి రాత్రంతా ఉండిపోయింది. ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోతుంది. ఇది చారిత్రక క్షణం. ఆనందించాల్సిన విజయం. చక్‌ దే ఇండియా`అని షారూఖ్‌ ఖాన్‌ పేర్కొన్నారు. 

అద్భుతమైన ప్రదర్శనతో విజయం సాధించి చరిత్ర సృష్టించారని అక్షయ్‌ కుమార్‌ అన్నారు.