వెంకటేష్‌ తన అభిమానులకు గిఫ్ట్ ఇచ్చాడు. తన 60వ పుట్టిన రోజుని పురస్కరించుకుని తాను నటిస్తున్న కొత్త చిత్రానికి సంబంధించిన సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. ప్రస్తుతం వెంకటేష్‌ `నారప్ప` చిత్రంలో నటిస్తున్నారు. తమిళంలో సూపర్‌ హిట్‌గా నిలిచిన `అసురన్‌`కిది రీమేక్‌. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియమణి.. వెంకీకి సరసన నటిస్తుంది. ఈ సినిమా టీజర్‌ని తాజాగా శనివారం సాయంత్రం ఏడుగంటలకు విడుదల చేశారు. 

ఇందులో వెంకటేష్‌.. చెట్టుచాటు నుంచి బయటకు ఆవేశంగా బయటకు వస్తుంటాడు. చేతిలో కత్తి పట్టుకుని రాత్రి సమయంలో వస్తుండటం, ఆ తర్వాత ఎగిరి ప్రత్యర్థులను నారకడం`తో టీజర్‌ పూర్తయ్యింది. డైలాగులు లేని ఈ టీజర్‌ని కేవలం బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌తో సాగుతుంది. అయితే మాతృకని యదాతథంగా తెరకెక్కిస్తున్నట్టు టీజర్‌ని చూస్తే అర్థమవుతుంది. వృద్ధుడి లుక్ లో వెంకీ ఆకట్టుకుంటున్నారు. పూర్తి డీ గ్లామర్‌ లుక్‌లోకి మారిపోయాడు. నారప్ప లుక్‌లో పరకాయ ప్రవేశం చేశారని చెప్పొచ్చు. 

వెంకటేష్‌ రేపు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఆయన 60వ బర్త్ కావడం వెంకీకేకాదు, ఆయన అభిమానులకు కూడా ఈ బర్త్ డే ప్రత్యేకంగా నిలిచింది. ఇప్పటికే వెంకీ బర్త్ డే సీడీపీ విడుదల చేశారు. `హ్యాపీబర్త్ డే విక్టరీ వెంకటేష్‌` పేరుతో విడుదల చేసిన సీడీపీ వైరల్‌ అవుతుంది. బర్త్ డే యాష్‌ ట్యాగ్‌ ట్రెండ్‌ అవుతుంది.