రవితేజ లేటెస్ట్ మాస్ ఎంటర్టైనర్ క్రాక్. దర్శకుడు గోపిచంద్ మలినేని తెరకెక్కిస్తున్నారు. రవితేజ మరోమారు పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుండగా... మూవీపై భారీ అంచనాలున్నాయి. సంక్రాంతి కానుకగా క్రాక్ విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీపై నేడు ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. క్రాక్ మూవీ కోసం విక్టరీ వెంకటేష్ వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియాలో అధికారిక పోస్టర్ విడుదల చేశారు. వెంకటేష్ వాయిస్ ఓవర్ ఇస్తున్న నేపథ్యంలో సినిమాపై మరింత హైప్ ఏర్పడింది. 

వెంకటేష్ లాంటి స్టార్ హీరో తమ విన్నపాన్ని మన్నించి వాయిస్ ఓవర్ చెప్పినందుకు చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేయడంతో పాటు, వెంకటేష్ కి ధన్యవాదాలు తెలిపారు. వెంకటేష్ తన వాయిస్ ఓవర్ కి సంబంధించి డబ్బింగ్ కూడా పూర్తి చేసినట్లు తెలుస్తుంది. ఎఫ్ 3మరియు నారప్ప షూటింగ్స్ తో బిజీగా ఉన్న వెంకటేష్.. నేడు క్రాక్ మూవీ కోసం వాయిస్ ఓవర్ ఇచ్చినట్లు సమాచారం. 

కాగా ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. క్రాక్ లో శృతి హాసన్ రవితేజ భార్యగా గృహిణి రోల్ చేయనున్నారు. వర్మ హీరోయిన్ అప్సరా రాణిని ఐటమ్ సాంగ్ కోసం తీసుకున్నారు. అలాగే టిక్ టాక్ స్టార్ దుర్గారావు ఓ చిత్ర పాత్ర చేస్తున్నారు. అనేక ప్రత్యేకతల మధ్య క్రాక్ సంక్రాంతికి ముస్తాబు అవుతుంది. క్రాక్ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.