ఇది ఒక డార్క్ ఫ్యామిలీ కథ. ప్రైవేట్ సెటిల్ మెంట్లను కార్పోరేట్ గా చేసే పాత్ర నాది. డైలాగ్స్ పరంగా అక్కడక్కడా కాస్త అభ్యంతరంగా అనిపించినా, కథ అలాంటిది కానుక తప్పలేదు. అందువల్లనే ఫ్యామిలీతో కలిసి చూడొద్దు అని చెప్పింది
వెంకటేశ్ - రానా ప్రధానమైన పాత్రలుగా 'రానా నాయుడు' వెబ్ సిరీస్ నిర్మితమైన సంగతి తెలిసిందే. కరణ్ అన్షుమాన్– సుపర్ణ్ ఎస్.వర్మ దర్శకత్వం వహించారు. నెట్ ఫ్లిక్స్ లో ఈ నెల 10వ తేదీ నుంచి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సీరిస్ కోసం వెంకటేష్ , రానాలకు ఎంతెంత రెమ్యునరేషన్ ఇచ్చి ఉంటారనేది హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ లో ఓ రేంజిలో క్రేజ్ ఉన్న వెంకీకు ఇది ఫస్ట్ వెబ్ సీరిస్. అలాగే రానా, వెంకీ కాంబినేషన్ వర్కవుట్ చేయటంతో ఈ సీరిస్ , తెర వెనక విశేషాలపై ఆసక్తి ఏర్పడింది.
అందుతున్న సమాచారం మేరకు 'రానా నాయుడు' వెబ్ సిరీస్ లో నటించినందుకు కాను...వెంకటేష్ కు 12 ఇచ్చినట్లు సమాచారం. అలాగే రానాకు 8 కోట్లు దాకా ఇచ్చారని తెలుస్తోంది. రెగ్యులర్ గా వెంకటేష్ కు 10 కోట్లు ఇస్తారు. దాన్ని మించి రెండు కోట్లు ఎగస్ట్రా ఇచ్చారు. "ఇది ఒక డార్క్ ఫ్యామిలీ కథ. ప్రైవేట్ సెటిల్ మెంట్లను కార్పోరేట్ గా చేసే పాత్ర నాది. డైలాగ్స్ పరంగా అక్కడక్కడా కాస్త అభ్యంతరంగా అనిపించినా, కథ అలాంటిది కానుక తప్పలేదు. అందువల్లనే ఫ్యామిలీతో కలిసి చూడొద్దు అని చెప్పింది" అన్నారు.
వెంకటేశ్ మాట్లాడుతూ .. "ఈ మధ్య కాలంలో వచ్చే వెబ్ సిరీస్ లను ఎవరికి వారే సెపరేట్ .. సెపరేట్ గానే చూస్తున్నారు. అలాంటి కంటెంట్ ఎక్కువగా ఉండటమే అందుకు కారణం. మన జాగ్రత్తలో మనం ఉండటం బెటర్. అందరికీ తెలుసు ఈ మధ్య ఏమేం వస్తున్నాయో .. అందుకే ఎవరి ల్యాప్ టాప్ లో వారు చూస్తున్నారు. "రేపు ఈ వెబ్ సిరీస్ చూసినవారు నేనేదో అలా చేశాను .. ఇలా చేశాను అనేది ఒకటి ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ లో కనిపించే ప్రధానమైన పాత్రలు .. ఆ పాత్రల నేపథ్యం .. అవి అనుభవించే సంఘర్షణలు .. ఆ ఫ్రస్టేషన్ లో అలాంటి సీన్స్ కనిపిస్తాయి. అలా అని భయపడాల్సిన పనిలేదు .. మంచి ఎమోషన్స్ ఉంటాయి. అంతా ఎంజాయ్ చేసే విధంగానే ఉంటాయి" అని చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ– ‘‘రానా నాయుడు’ లో రానా చీకటి జీవితం గడుపుతుంటాడు. కానీ తన కుటుంబాన్ని పో షించడానికి బాగా కష్టపడతాడు. నా పాత్రలో ఎక్కువ కోపం చూపించే సన్నివేశాలున్నాయి. నిజ జీవితంలో నేను ప్రశాంతంగా ఉంటాను. కానీ ఈ సిరీస్‌లో కోపం ప్రదర్శించడం సవాలుగా అనిపించింది. అదృష్టవశాత్తూ మా బాబాయ్‌కి(వెంకటేష్), నాకు ఆఫ్ స్క్రీన్ కూడా మంచి బాండింగ్ ఉండటంతో నటించడం సులభం అయింది. వైరం ఉన్న పాత్రలో మెప్పించడం ఒక సవాల్‌తో కూడుకున్నప్పటికీ రానా, నాగా(వెంకటేష్ క్యారెక్టర్) పాత్రలు, వాటి మధ్య ఉండే ఆవేశం, భావోద్వేగాల పైనే దృష్టిపెట్టాం’’ అన్నారు.
"ఇది సినిమాగా చెప్పలేని కథ .. అందువల్లనే వెబ్ సిరీస్ గా చేయవలసి వచ్చింది. వెబ్ సిరీస్ ల వలన ఆర్టిస్టులు ముంబైకి షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువని చెప్పుకుంటున్నారు. కానీ అందులో ఎంతమాత్రం నిజం లేదు. నిజానికి ముంబైవారే ఇక్కడికి వస్తారు. ఎందుకంటే వెబ్ సిరీస్ లకు సంబంధించి ఇక్కడ ఉన్నన్ని అవకాశాలు ఎక్కడా లేవు" అని చెప్పారు.
