వెంకటేష్ చాలా కూల్ పర్శన్. ముఖ్యంగా సెట్స్ పై తన పని తప్ప వేరేదేమీ ఆలోచించరు. సీన్ పేపర్లు తీసుకుని ప్రాక్టీస్ చేసుకోవటం చేస్తూంటారు. సీనియర్ కావటంతో ఆయనపై చాలా గౌరవంగా, జాగ్రత్తగా ఉంటూంటారు టీమ్. దర్శకులకు ఆయనంటే చాలా ఇష్టం. ఏ ఎక్సప్రెషన్ అయినా నిముషాల్లో ఇచ్చి, వేరియేషన్స్ అడుగుతూంటారు. అలాంటి వెంకటేష్ కూడా రీసెంట్ గా వెంకీ మామ సెట్స్ కోప్పడ్డరని సినీ వర్గాల సమాచారం. అందుకు కారణమేంటనేది ఇప్పుడు అంతటా చర్చనీయాంసంగా మారింది.

ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ..వెంకటేష్ ఎప్పటిలాగే వెంకీ మామ షూటింగ్ లొకేషన్ లో తన స్క్రిప్టు కాగితాలతో కుస్తీ పడుతున్నారట. అయితే ఈ లోగా స్క్రిప్టు మారిందంటూ మరో సెట్ కాగితాలు తెచ్చి ఆయనకు ఇచ్చారట. అలా జరగటం కామన్ అవ్వటంతో సరే అనుకుని వాటిని చూస్తూ షూటింగ్ కు రెడీ అయ్యారట. 

ఈలోగా అసిస్టెంట్ వచ్చి షూట్ కు పిలవటం , ఆయన వెళ్ళటం జరిగింది. అక్కడకి వెల్లాక మరోసారి స్క్రిప్టు  కాగితాలు చేతిలో పెట్టారట. అప్పటిదాకా ప్రిపేర్ అయ్యింది మొత్తం దర్శకుడు మార్చేసాడట. ఇలా లాస్ట్ మినిట్ లో స్క్రిప్టు మార్చవద్దని అప్పటికే చాలా సార్లు చెప్పి ఉన్నారట. దాంతో వెంకటేష్ కు కోపం నషాలానికి అంటిందట.

వెంటనే డైరక్టర్ పై ఫైర్ అయ్యారని సమాచారం. దర్శకుడు ఇలా మరోసారి జరగదని సారి చెప్పి, షూటింగ్ కొనసాగించాడని చెప్పుకుంటున్నారు. ఇందులో ఎంతవరకూ నిజం ఉందో కానీ సినిమా మాత్రం బాగా వస్తోందిట. గతంలోనూ లవకుశ టైమ్ లోనూ ఎన్టీఆర్ ఇదే విషయమై దర్శకుడు బాబిపై కోపం తెచ్చుకున్నారట. ఇక ఇవన్నీ ప్రక్కన పెడితే.. ముఖ్యంగా చైతూ, వెంకీ మధ్య వచ్చే సన్నివేశాలు హైలెట్ అంటున్నారు. జ్యోతిష్యం, జాతకాలు చుట్టూ తిరిగే కథ అని తెలిసింది.