Asianet News TeluguAsianet News Telugu

'ఎఫ్ 3' క్లైమాక్స్ లో ప్యాన్ ఇండియా సర్పైజ్


అలాగే ఈ సినిమాలో వెంకటేష్ కు రేచీకటి, వరుణ్ తేజ్ కు నత్తి ఉంటాయి. అయితే అవి కథను ఏ మాత్రం డిస్ట్రబ్ చేయవు. అలాగే అవి కొన్ని సీన్స్ లో మాత్రమే వాడటం జరిగింది. ఇప్పటిదాకా ఈ సినిమా షూటింగ్  80% పూర్తైంది. టాకీ పార్ట్ కొంత,పాటలు బాలెన్స్ ఉన్నాయి.  డిసెంబర్ కు మొత్తం టాకీ పూర్తవుతుంది.

Venkatesh F3 Has Pan India Surprise In Climax
Author
Hyderabad, First Published Nov 23, 2021, 8:00 PM IST

 అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన `ఎఫ్ 2` ఎంత పెద్ద  హిట్ అయిందో అందరికి తెలిసిందే. వెంకటేష్ (Venkatesh) కామెడీ టైమింగ్, వరుణ్ తేజ్(Varun Tej) పంచ్ లు.. తమన్నా, మెహ్రీన్ గ్లామర్ కు తోడు రాజేంద్రప్రసాద్ వంటి సీనియర్ నటులు తోడవడంతో అనిల్ రావిపూడి కథ నెక్ట్స్ లెవిల్ కు  వెళ్ళింది. ఈ సినిమా సక్సెస్ తర్వాత సీక్వెల్ గా `ఎఫ్ 3`(F3) తెరకెక్కుతోంది. వాస్తవానికి ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదాల అనంతరం వచ్చే ఏడాది ఫిబ్రవరి 25న విడుదలకు ప్రకటించారు. ఇక ఈ నేపధ్యంలో ఈ చిత్రం గురించిన ఓ విశేషం దర్శకుడు అనీల్ రావిపూడి వివరించారు.

అనీల్ రావిపూడి మాట్లాడుతూ... f3 చిత్రంలో పాన్ ఇండియా సర్పైజ్ క్లైమాక్స్ లో ఉంది. ఇప్పుడు ఏమీ చెప్పను కానీ థియోటర్ లో ఆ పోర్షన్స్ చూసినప్పుడు జనం బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక నేను ప్యాన్ ఇండియా సినిమాని భవిష్యత్ లో ఖచ్చితంగా ట్రై చేస్తాను. అయితే నేను ఎంచుకున్న కథలో ఆ పొటిన్షిల్ ఉండాలి. తెలుగులో సినిమాలు తెరకెక్కించటంలో నాకు చాలా కంఫర్ట్ ఉంది.  ఎఫ్ 2తో పోలిస్తే ఎఫ్‌ 3 సినిమాలో ఫన్ అండ్ గ్లామర్ డోస్ పెంచిన అనిల్ రావిపూడి ఈ సీక్వెల్ కోసం తమన్నా, మెహరీన్ కు తోడుగా సోనాల్ చౌహన్ ను కూడా తీసుకున్నారు.  
 
అలాగే ఈ సినిమాలో వెంకటేష్ కు రేచీకటి, వరుణ్ తేజ్ కు నత్తి ఉంటాయి. అయితే అవి కథను ఏ మాత్రం డిస్ట్రబ్ చేయవు. అలాగే అవి కొన్ని సీన్స్ లో మాత్రమే వాడటం జరిగింది. ఇప్పటిదాకా ఈ సినిమా షూటింగ్  80% పూర్తైంది. టాకీ పార్ట్ కొంత,పాటలు బాలెన్స్ ఉన్నాయి.  డిసెంబర్ కు మొత్తం టాకీ పూర్తవుతుంది.

ఇక ఎఫ్ 2 కథ భార్యా,భర్తల మధ్య జరుగుతుంది.  అయితే ఎఫ్ 3 చిత్రం డబ్బు చుట్టూ తిరుగుతుంది. సునీల్, మురళి శర్మ ఈ సినిమా కొత్తగా కలుస్తారు. సరిలేరు నీకెవ్వరు వంటి సీరియస్ సబ్జెక్టు తర్వాత నేను చేస్తున్న హిలేరియస్ ఎంటర్టైనర్ ఇది. ఖచ్చితంగా ఆడియన్స్ ఎక్సపెక్టేషన్స్ రీచ్ అవుతాము అన్నారు. “దృశ్యం 2” ప్రమోషన్స్ లో భాగంగా తాజా ఇంటర్వ్యూలో వెంకటేష్ ఈ సినిమా విడుదల గురించి స్పందించారు. వెంకీ ‘ఎఫ్ 3’ సంక్రాంతికి విడుదల కాబోదని క్లారిటీ ఇచ్చేశాడు. ‘ఎఫ్ 3’ వేసవిలో విడుదలవుతుందని, ఇప్పటి వరకు సినిమా 70 శాతం షూటింగ్ ఫార్మాలిటీస్‌ను పూర్తి చేసిందని వెంకీ మామ చెప్పాడు.

వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్, సునీల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న “ఎఫ్3” చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా, దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజర్ గా వ్యవహరిస్తున్నారు.

also read: Priyanka Chopra: అంతా తూచ్‌..ఒక్క పోస్ట్ తో `డైవర్స్` రూమర్లకి చెక్‌ పెట్టిన ప్రియాంక చోప్రా

Follow Us:
Download App:
  • android
  • ios