వరుస విజయాలతో ఉపుమీదున్న వరుణ్ తేజ్ ప్రతి సారి డిఫరెంట్ సినిమాలను వదులుతున్నాడు. ఫిదా సక్సెస్ తో డిఫరెంట్ జానర్స్ ని టచ్ చేస్తున్నాడు. కెరీర్ లో మొదటిసారి వెంకటేష్ తో కలిసి ఎఫ్ 2 అనే మల్టీస్టారర్ లో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాపై అంచనాలు కూడా బాగానే ఉన్నాయి. అయితే నేడు చిత్ర యూనిట్ టీజర్ ను రిలీజ్ చేసింది. 

దర్శకుడి అనిల్ రావిపూడి మళ్ళీ తన కామెడీ టాలెంట్ ను చూపించనున్నట్లు చెప్పేశాడు. పూర్తిగా సినిమా అందరిని నవ్విస్తుందని వెంకీ - వరుణ్ క్యారెక్టర్స్ తో చూపించాడు. పెళ్లి అనే విషయంపై నిత్యం కామెడీ పంచ్ లు దర్శమిస్తుంటాయి. పెళ్ళికి ముందు పెళ్లి తరువాత అనే కాన్సెప్ట్ తో ఫుల్ ఎంటర్టైనర్ గా సాగనున్న కథలో వెంకీ వరుణ్ తోడల్లుళ్ళుగా కనిపించనున్నారు. 

ఇక వారి డైలాగ్స్ తెరపై అల్టిమేట్ కామెడీని అందిస్తాయని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. టీజర్ తో మంచి పాజిటివ్ టాక్ ను అందుకుంటున్న ఎఫ్ 2 సినిమాతో సంక్రాంతికి ఏ స్థాయిలో సందడి చేస్తారో చూడాలి. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో తమన్నా - మెహ్రీన్ హీరోయిన్స్ గా నటించిన సంగతి తెలిసిందే.