`జేమ్స్ బాండ్‌` సిరీస్‌కి ఆద్యుడు, స్టయిలీష్‌ స్పైకి అసలైన రూపాన్నిచ్చిన మేటి నటుడు సీన్‌ కానరీ శనివారం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయనకు యావత్‌ ప్రపంచ సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. తాజాగా టాలీవుడ్‌ స్టార్స్ సంతాపం తెలిపారు. పెద్దోడు వెంకటేష్‌, చిన్నోడు మహేష్‌ సంతాపం తెలిపారు. 

ట్విట్టర్‌ వేదికగా నివాళ్లర్పించారు. ఆయన లెగసీని కొనియాడారు. `మీ ఆత్మకు శాంతి చేకూరాలి బాండ్. మీ లెగసీ ఎప్పటికీ మా గుండెల్లో నిలిచే ఉంటుంది` అని వెంకటేష్‌ ట్వీట్‌ చేశారు. మరోవైపు మహేష్ స్పందిస్తూ, తన నటనతో అధికమైన బార్‌ని సెట్‌ చేశారు. తెరవెనుక కూడా ఆయన లెగసీ నిలిచే ఉంది. అద్భుతమైన సినిమాలు అందించినందుకు థ్యాంక్స్ ` అని తెలిపారు.