Asianet News TeluguAsianet News Telugu

అప్పుడు ‘ మహర్షి ’ పై ఇప్పుడు శ్రీకారం పై ఉప రాష్ట్రపతి ట్వీట్

 శర్వానంద్ - ప్రియాంక మోహన్ జంటగా నటించిన శ్రీకారం మూవీ మహా శివరాత్రి రోజున విడుదలై మంచి టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. వ్యవసాయం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా రైతు కష్టాలను కళ్ళకు కట్టినట్టుగా చూపించింది. ప్రతిభ కుర్రాడు యువకుడు పేరు, హోదా, ఉద్యోగాన్ని వదిలి వ్యవసాయం కోసం తన ఊరు వచ్చెయ్యడం, తండ్రి మాత్రం కొడుకు అమెరికా వెళ్లబోతున్నాడు తమ జీవితాలు మారతాయంటూ చెప్పుకోవడం, కానీ ఉద్యోగం వదిలి వచ్చిన కొడుకు వ్యవసాయం చేస్తానంటే తండ్రి ఖంగు తింటాడు. ఉద్యోగంలో కావల్సిన జీతాలు అందుకున్నా ఎక్కడో ఏదో అసంతృప్తి తో ఉండే యూత్ చాలామంది వ్యవసాయం చెయ్యడానికి సంకల్పించడం అనేది శ్రీకారంలో చూపెట్టారు. రామ్‌ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా నిర్మించారు. ప్రియాంక అరుళ్‌ మోహన్‌ హీరోయిన్. ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. 

Venkaiah Naidu heaped praise on 'Srikaram' movie jsp
Author
Hyderabad, First Published Mar 23, 2021, 4:38 PM IST

శర్వానంద్ - ప్రియాంక మోహన్ జంటగా నటించిన శ్రీకారం మూవీ మహా శివరాత్రి రోజున విడుదలై మంచి టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. వ్యవసాయం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా రైతు కష్టాలను కళ్ళకు కట్టినట్టుగా చూపించింది. ప్రతిభ కుర్రాడు యువకుడు పేరు, హోదా, ఉద్యోగాన్ని వదిలి వ్యవసాయం కోసం తన ఊరు వచ్చెయ్యడం, తండ్రి మాత్రం కొడుకు అమెరికా వెళ్లబోతున్నాడు తమ జీవితాలు మారతాయంటూ చెప్పుకోవడం, కానీ ఉద్యోగం వదిలి వచ్చిన కొడుకు వ్యవసాయం చేస్తానంటే తండ్రి ఖంగు తింటాడు. ఉద్యోగంలో కావల్సిన జీతాలు అందుకున్నా ఎక్కడో ఏదో అసంతృప్తి తో ఉండే యూత్ చాలామంది వ్యవసాయం చెయ్యడానికి సంకల్పించడం అనేది శ్రీకారంలో చూపెట్టారు. రామ్‌ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా నిర్మించారు. ప్రియాంక అరుళ్‌ మోహన్‌ హీరోయిన్. ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. 

వ్యవసాయం ఇతివృత్తంగా తెరకెక్కిన ‘శ్రీకారం’ చిత్ర టీమ్ కి ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఓ ట్వీట్‌ చేశారు. గతంలో మహర్షి సినిమా చూసి వ్యవసాయాన్ని ప్రోత్సహించే ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు రావాలంటూ మహర్షి సినిమా అప్పుడు ట్వీట్ చేసిన వెంకయ్య నాయుడు ఇప్పుడు శ్రీకారం సినిమా చూసి.. ట్వీట్ చేయటం అందరినీ ఆకర్షించింది. ‘‘వ్యవసాయ పునర్వైభవం కోసం గ్రామాలకు మరలండి అనే స్ఫూర్తిని యువతలో రేకెత్తించే విధంగా తెరకెక్కించిన ‘శ్రీకారం’ చక్కని చిత్రం. కుటుంబం, ఊరు అందరూ కలిసి ఉంటే సాధించలేనిది ఏదీ లేదనే చక్కని సందేశాన్ని అందించిన చిత్ర దర్శక నిర్మాతలు, నటీనటులకు శుభాకాంక్షలు’’ అని పేర్కొన్నారు.  

దర్శకుడు మాట్లాడుతూ  ‘‘ఈ కథ రాసుకున్నప్పటి నుంచీ కొన్ని సీన్స్‌ కచ్చితంగా అందరినీ ఆకట్టుకుంటాయని అనుకున్నాం. ఇప్పుడా సన్నివేశాలకు మేం అనుకున్న దాని కన్నా మంచి ఆదరణ దక్కుతోంది. ప్రేక్షకులు ట్రాక్టర్స్‌ కట్టుకుని మరీ సినిమాకు వెళ్తున్నారు’’అన్నారు. ‘‘మంచి కథ పడితే ప్రతి ఆర్టిస్ట్‌ ఎలివేట్‌ అవుతాడని చెప్పడానికి ఈ సినిమా మంచి ఉదాహరణ’’ అన్నారు నటుడు సాయికుమార్‌. నిర్మాత గోపీ ఆచంట మాట్లాడుతూ.. ‘‘ఇంత మంచి సినిమాలో భాగమైనందుకు ఓ నిర్మాతగా చాలా గర్వంగా ఉంది. మనుషుల విలువల్ని.. వారి మధ్య ఉండే భావోద్వేగాల్ని దర్శకుడు తెరపై ఎంతో సహజంగా చూపించారు. మంచి చిత్రాలు తీస్తే ప్రేక్షకులు  కచ్చితంగా ఆదరిస్తారని మరోసారి నిరూపితమైంది. ఇంత మంచి సినిమా చూసి చాలా కాలమైందని అభినందిస్తున్నారు. కుటుంబ కథా చిత్రం కాబట్టి మంచి వసూళ్లు వస్తాయని నమ్మకం ఉంద’’న్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios