పటాస్ - సుప్రీమ్ సినిమాలతో కమర్షియల్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి ఆ తరువాత రాజా ది గ్రేట్ సినిమాతో డిఫరెంట్ హిట్ అందుకున్నాడు. ఇక నెక్స్ట్ మరింత వినూత్నంగా ఇద్దరి హీరోలతో తెరపై సందడి చేయించనున్నాడు. వెంకటేష్ - వరుణ్ F2 సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. 

శరవేగంగా జరుగుతోన్న సినిమా షూటింగ్ మరికొన్ని రోజుల్లో ముగియనుంది. అయితే పనిలో పనిగా చిత్ర యూనిట్ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేస్తోంది. సినిమాకు సంబందించిన ఫొటోలతో ఎప్పటికప్పుడు సినిమాపై అంచనాలు పెరిగేలా చేస్తున్నారు. 

ఇక రీసెంట్ గా చిత్ర యూనిట్ నుంచి మరో గుడ్ న్యూస్ అందింది. దీపావళి సందర్బంగా అందరిని ఆకట్టుకునే విధంగా సినిమా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయనున్నట్లు చెప్పారు. 

5వ తేదీన సాయంత్రం నాలుగు గంటలకు పోస్టర్ ని రిలీజ్ కానుంది. వెంకటేష్ - వరుణ్ సరికొత్త గెటప్ లో కనిపిస్తారని చిత్ర యూనిట్ ద్వారా తెలిసింది. ఇక సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలనీ నిర్మాత దిల్ రాజు సన్నాహకాలు చేస్తున్నారు.