సెలబ్రెటీ లకు హాలిడేస్ దొరికితే అంతకంటే గొప్ప స్వేచ్ఛ మరోటి ఉండదేమో? ఏ మాత్రం గ్యాప్ దొరికినా పక్షుల్లా ఖండాలు దాటేస్తారు. ఇక అందుకు ప్రతిసారి ఉదాహరణగా నిలిచే కపుల్స్ వీరుష్క. హాలిడేస్ ని ఏ జంట ఏ రేంజ్ లో సెలెబ్రేట్ చేసుకుంటుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. 

రీసెంట్ గా బీచ్ లో విరాట్ అనుష్క సరదాగా దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బుంగమూతితో కనిపిస్తున్న విరాట్ ను అనుష్క గట్టిగా హత్తుకొని ఫోటోకి స్టిల్ ఇచ్చింది. ఈ జంట చాలా బావుంది అంటూ నెటిజన్స్ పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఇక వీరిద్దరి కెరీర్ లు మరికొన్ని రోజుల్లో స్పీడందుకోనున్నాయి. ప్రస్తుతం అనుష్క నాలుగు సినిమాల్లో నటిస్తోంది. ఇక విరాట్ ఆదివారం స్టార్ట్ కానున్న సౌత్ ఆఫ్రికా టి20 సిరీస్ తో బిజీగా మారనున్నాడు.  

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

❤️

A post shared by Virat Kohli (@virat.kohli) on Sep 10, 2019 at 11:12pm PDT