నీది నాది ఒకే కథ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వేణు అడుగుల మరో సరికొత్త ప్రయోగానికి సిద్దమవుతున్నాడు. విరాటపర్వం అనే టైటిల్ ని ఇదివరకే ఫిక్స్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక మెయిన్ లీడ్ లో హీరోయిన్ సాయి పల్లవి ఈ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

ఈ విరాటపర్వం సినిమాలో హీరో రానా కీలక పాత్రలో కనిపించనున్నాడు. పొలిటికల్ నేపథ్యంలో సాగే ఈ కథ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. మొదట రానా పాత్ర కోసం కోలీవుడ్ హీరో కార్తీని అనుకున్నప్పటికీ గత కొంత కాలంగా కథపై చర్చలు జరిపిన రానా ఫైనల్ గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.     

పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్క నున్న ఈ సినిమాలో లవ్ స్టోరీ కూడా ఉందట. ప్రస్తుతం రానా 1945 సినిమాతో పాటు మరో రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అలాగే సాయి పల్లవి నటించిన NGK రిలీజ్ కి రెడీగా ఉంది. మరి ఈ ఇద్దరు కలిసి నటించబోయే విరాటపర్వం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.