ఎప్పటిలాగే బాలయ్య పాత్రకి తగినట్టుగానే పవర్ఫుల్ డైలాగ్స్ దట్టించారనే విషయం ట్రైలర్ ను బట్టి అర్థమవుతోంది.
నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘వీరసింహారెడ్డి’ ట్రైలర్ వచ్చేసింది. ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేసిన సంగతి తెలిసిందే. ఆ రెండు పాత్రలను ఈ ట్రైలర్ లో రివీల్ చేసి అలరించారు. ఎప్పటిలాగే బాలయ్య పాత్రకి తగినట్టుగానే పవర్ఫుల్ డైలాగ్స్ దట్టించారనే విషయం ట్రైలర్ ను బట్టి అర్థమవుతోంది. 'నాది ఫ్యాక్షన్ కాదు .. సీమ మీద ఎఫెక్షన్' .. 'పదవి చూసుకుని నీకు పొగరెక్కువేమో .. బై బర్త్ నా డీఎన్ ఏకే పొగరెక్కువ' వంటి డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.అదే సమయంలో ఓ డైలాగు చర్చనీయాంశంగా మారింది.
“సంతకాలు పెడితే బోర్డ్ మీద పేరు మారుతుందేమో కానీ ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు.. మార్చలేరు” అనే డైలాగ్ గురించే మాట్లాడుతున్నారు. బాలకృష్ణ చెప్పిన ఈ డైలాగ్ వైసీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించే అని అంటున్నారు. గతేడాది విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరును వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీగా మారుస్తూ వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
అప్పట్లోనే యూనివర్శిటీ పేరు మార్చగలరు కానీ.. ఎన్టీఆర్ కీర్తిని కాదు అని అన్నారు. ఇప్పుడు అదే తరహాలో బాలకృష్ణ చెప్పిన డైలాగ్ నాటి సంఘటనపై ప్రభుత్వానికి అనధికారిక కౌంటర్ అని తేలుస్తున్నారు. ఈ డైలాగ్ పై రాజకీయంగా కౌంటర్లు వస్తాయని ఎక్సపెక్ట్ చేస్తున్నారు. ఇలాంటి డైలాగులు సినిమాలు చాలా ఉన్నాయని వినికిడి.
బాలకృష్ణ రెండు వైవిధ్యమైన గెటప్స్‌లో కనిపిస్తున్న ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించగా, ఫ్యాక్షన్ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా.. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీగా నిర్మిస్తున్నారు.
నెగెటివ్ పాత్రల్లో దునియా విజయ్, వరలక్ష్మీ శరత్ కుమార్‌లు పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చినట్లుగా ట్రైలర్‌లో చూపెట్టారు. హీరోయిన్ శ్రుతి హాసన్ పాత్రకు సంబంధించి ఎక్కువగా ఎలివేట్ చేయలేదు. ఇప్పటికే విడుదలైన గ్లిమ్ప్స్, టైటిల్ టీజర్ కు, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇందులో దునియా విజయ్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నాడు.
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమా సంక్రాంతి కానుకగా ఈనెల 12న విడుదల కానుంది. నేడు ఒంగోలులో చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. దీంతోపాటే సినిమా ట్రైలర్ కూడా విడుదల చేశారు. అయితే.. ట్రైలర్ లో డైలాగ్ ఆసక్తిగా మారింది.
