చియాన్  విక్రమ్ నటించిన 'వీర ధీర సూరన్'2 సినిమా లీగల్ అడ్డంకులను ఫేస్ చేసి.. ఎట్టకేలకు రిలీజ్ కు రెడీ అయ్యింది. ఇక ఈ సినిమా చూసిన ఆడియన్స్  ట్విట్టర్ లో ఏమని రివ్యూ ఇస్తున్నారంటే? 

విక్రమ్ హీరోగా, ఎస్.యు అరుణ్ కుమార్ డైరెక్షన్‌లో, హెచ్‌ఆర్ పిక్చర్స్ బ్యానర్‌పై వచ్చిన సినిమా 'వీర ధీర సూరన్ 2'. ఈసినిమాలో విక్రమ్‌తో పాటు ఎస్. జె. సూర్య, సురాజ్ వెంచరమూడు, దుషారా విజయన్ తదితరులు నటించారు. గత రెండు వారాలుగా ఈ సినిమా ప్రమోషన్లు బాగా చేశారు. కానీ, ఈ రోజు ఉదయం 9 గంటలకు స్పెషల్ షో ఉంటుందని ఎదురు చూసిన ఫ్యాన్స్‌కు నిరాశే ఎదురైంది. 'వీర ధీర సూరన్' సినిమా విడుదల చేయకుండా ఐ.వి.వై ఎంటర్‌టైన్‌మెంట్ అనే సంస్థ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది. దీంతో సినిమా విడుదలకి 4 వారాల పాటు బ్రేక్ పడింది.

ఆ తర్వాత ప్రొడ్యూసర్ టీమ్, ఐ.వి.వై ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థతో మాట్లాడి సమస్యను పరిష్కరించుకున్నారు. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు సినిమా ఫస్ట్ షో వేశారు. చాలా ఆశలతో ఎదురు చూసిన ఫ్యాన్స్ సినిమా చూసి ట్విట్టర్‌లో రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఇంతక ఈసినిమాపై ట్విట్టర్ రివ్యూ చూసుకుంటే. ఒక ఫ్యాన్ ఏమన్నాడంటే, 'వీర ధీర సూరన్' సినిమా సూపర్ హిట్ కొట్టింది. 30 నిమిషాల ఫ్లాష్‌బ్యాక్ సీన్ కాస్త లాగ్ అనిపించినా, డైరెక్టర్ ఎస్.యు అరుణ్‌కుమార్ మాత్రం సూపర్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను అందించాడు. సెకండ్ హాఫ్ కూడా అదిరిపోయింది అని చెప్పాడు.

Scroll to load tweet…
Scroll to load tweet…

మరో వ్యక్తి 'వీర ధీర సూరన్' సినిమాకు 5కి 4 పాయింట్లు ఇచ్చాడు. అంతేకాదు, సినిమా చాలా బాగుంది! ఎస్.యు అరుణ్‌కుమార్ తీసిన సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. రివేంజ్ సీన్స్ బాగా కనెక్ట్ అయ్యాయి. ఇంటర్వెల్ తర్వాత వచ్చే సీన్ సినిమాకు హైలైట్. 12 నిమిషాల సింగిల్ షాట్ అయితే అదుర్స్. విక్రమ్ బాగా నటించాడు. జివి ప్రకాష్ మ్యూజిక్ అదిరింది అని చెప్పాడు.

Scroll to load tweet…
Scroll to load tweet…

మరొక అభిమాని  సింపుల్‌గా తన రివ్యూ చెప్పాడు. ఈ సినిమా ఒక మంచి థ్రిల్లర్. విక్రమ్, ఎస్ జె సూర్య, దుషారా బాగా నటించారు. జివి మ్యూజిక్ సూపర్. స్క్రీన్ ప్లే, స్టోరీ, టెక్నికల్‌గా కూడా సినిమా బాగుంది అని చెప్పి 5కి 3 స్టార్స్ ఇచ్చాడు. ఇలా ట్విట్టర్ లో విక్రమ్ సినిమాపై ఆడియన్స్ పాజిటీవ్ రెస్పాన్స్ అందించారు. 

Scroll to load tweet…
Scroll to load tweet…