Asianet News TeluguAsianet News Telugu

పునీత్ చేసిన మరో గొప్ప పని, టీఎస్ఆర్టీసీ తరుపున సజ్జనార్ నివాళి

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అకాల మరణం చెందడం దేశం మొత్తం ఊహించని షాక్ గా మారిపోయింది. 46 ఏళ్ల వయసులోనే పునీత్ మరణించడం అభిమానులకు, కుంటుంబ సభ్యులకు జీర్ణించుకోలేని వేదనగా మిగిలిపోయింది.

VC Sajjanar condolences to Puneeth Rajkumar death
Author
Hyderabad, First Published Oct 30, 2021, 9:31 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అకాల మరణం చెందడం దేశం మొత్తం ఊహించని షాక్ గా మారిపోయింది. 46 ఏళ్ల వయసులోనే పునీత్ మరణించడం అభిమానులకు, కుంటుంబ సభ్యులకు జీర్ణించుకోలేని వేదనగా మిగిలిపోయింది. దీనితో పునీత్ రాజ్ కుమార్ ప్రతిభని, సినిమాలని, సేవా కార్యక్రమాలని అంతా గుర్తు చేసుకుంటున్నారు. 

VC Sajjanar condolences to Puneeth Rajkumar death

Puneeth Rajkumar అనాధాశ్రమాలు, స్కూల్స్, పిల్లలకు చదువులు లాంటి సేవాకార్యక్రమాలు తన సొంత ఖర్చులతో చేశారు. అలాగే అనేక అవేర్నెస్ కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. ప్రముఖ ఐపీఎస్ అధికారి, ప్రస్తుతం తెలంగాణ ఆర్టీసీకి మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేస్తున్న Sajjanar పునీత్ రాజ్ కుమార్ మృతి పట్ల సంతాపం తెలియజేశారు. ఈ సందర్భంగా సజ్జనార్ పునీత్ చేసిన ఓ గొప్ప పనిని గుర్తు చేసుకున్నారు. 

పునీత్ రాజ్ కుమార్ గతంలో బెంగళూరు మెట్రో పాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (బీఎంటీసీ ) కి బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేశారు. ప్రజలు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉపయోగించి సేఫ్ గా రవాణా సౌకర్యం పొందాలని సూచించారు. అలాగే బస్ ప్రయారిటీ లేన్ గురించి ప్రజల్లో అవగాహన పెంచారు. బస్ ప్రయారిటీ లేన్ లో బీఎంటీసీ బస్సులు, అంబులెన్స్ లు, ఫైర్ ఇంజన్లు లాంటి అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఉంటుంది. దీని ద్వారా ప్రజలకు రవాణా సౌక్యారం వేగంగా అందుతుంది. 

Also Read: Puneeth Rajkumar death:కుమార్తె వచ్చిన తర్వాతే.. పునీత్ అంత్యక్రియల వివరాలు

2019లో పునీత్ రాజ్ కుమార్ బీఎంటీసీకి బ్రాండ్ అంబాసిడర్ గా నియమించబడ్డారు. ఈ సేవలని సజ్జనార్ గుర్తు చేసుకుంటూ.. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ని ఎంకరేజ్ చేసినందుకు గాను పునీత్ ని అభించారు. తాజాగా ఆయన మృతిపట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన సజ్జనార్.. పునీత్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. తెలంగాణ ఆర్టీసీ తరుపున పునీత్ మృతికి సంతాపం తెలియజేస్తూ ప్రెస్ నోట్ కూడా విడుదల చేశారు. 

VC Sajjanar condolences to Puneeth Rajkumar death

Follow Us:
Download App:
  • android
  • ios