Guppedantha Manasu: రిషి భార్యగా ఇంట్లోకి అడుగుపెట్టిన వసుధార.. దేవయానికి బుద్ధి చెప్పిన చక్రపాణి?

Guppedantha Manasu: బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్  కొనసాగుతుంది. ఇక ఈరోజు మార్చి 10వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
 

Vasudhara at rishis house in todays guppedantha manasu serial gnr

ఈరోజు ఎపిసోడ్ లో రిషి, వసుధార కోసం మినిస్టర్ తీసుకువచ్చిన గిఫ్ట్ తీసుకుని ఇవ్వగా ఇది మనవి కదా సార్ మీ దగ్గరే పెట్టుకోండి అనడంతో ఇవి మనవి కాదు నీవి అని అనడంతో నీ ఇవి నావి అని వేరు చేసి మాట్లాడుతున్నారా సార్ అని అనుకుంటూ ఉంటుంది వసుధార. ఇవి మనవి కదా సార్ మీ దగ్గరే ఉంచుకోండి అనడంతో మంగళసూత్రం నీ మెడలోనే ఉంది నీకు నువ్వుగా కట్టుకున్నావు కదా తీసుకో అని అంటాడు రిషి. అన్ని నేనే తీసుకుంటే మీకు ఎలా సార్ అనగా నాకు నా బాధలు ఉన్నాయి వసుధార అవే సరిపోతాయి అని బాధగా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రిషి. అదంతా కూడా చక్రపాణి చూసి ఆలోచనలో పడతాడు. ఆ తర్వాత రిషి ఇంటికి వెళ్ళగా అప్పుడు వసు చిన్నచోట పూలు ఉండగా అ పూల వైపు అలాగే చూస్తుండగా ఇంతలోనే వసుధార థాంక్స్ ఎండి గారు, మీరు జెంటిల్ మెన్ అని మెసేజ్ చేస్తుంది.

అప్పుడు ఎందుకు థాంక్స్ అని మెసేజ్ చేస్తాడు రిషి. అప్పుడు వారిద్దరు సరదాగా చాట్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడు రిషి తనకు అయిన గాయం గురించి మెసేజ్ చేయడంతో వసుధార బాధపడుతూ ఉంటుంది. తర్వాత వసుధార తన తాళిబొట్టుకు ఉన్న విఆర్ అనే ఉంగరాన్ని చూస్తూ బాధపడుతూ ఉంటుంది. ఈ ఉంగరం లో ఉన్న అక్షరాలు వేరు కాదు కదా సార్ నీ బాధలు నా బాధలు కావా సార్ అని అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది. నాకోసం ఇంతలా తాపత్రయ పడుతున్నప్పుడు నేను మిమ్మల్ని అలా ఎలా వదిలేస్తాను సార్ మీ కోసం ఒక అడుగు ముందుకు వేస్తాను అని ఆలోచిస్తూ ఉంటుంది వసుధార. ఆ తర్వాత దేవయాని కూర్చుని ధరణి కాఫీ తీసుకొని రా అనగా పాలు లేవు అనడంతో ఇంతలోనే అక్కడికి ఫణీంద్ర, మహేంద్ర జగతి  వాళ్లు వస్తారు. అప్పుడు మహేంద్ర ఏంటి ధరణి నువ్వు పాలు లేకపోతే తెప్పించుకోవాలి కదా ఎలా వదిన గారిని ఇబ్బంది పెడితే ఎలా అని అంటాడు.

 నాకోసం కాదు మహేంద్ర రిషి కోసం రిషి లేచి కాఫీ అడాగ్గితే అప్పుడు ఏం చెప్పాలి అంటూ రిషి మీద లేనిపోని ప్రేమలు ఉలకబోస్తూ ఉంటుంది. ఇంతలోనే ఎవరో వచ్చారు అని దేవయాని వెళ్లి తలుపులు తీయగా అక్కడ చక్రపాణిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అప్పుడు ధరణి ఫణింద్ర వాళ్ళు ఎంత పిలిచినా కూడా దేవయాని పలకకుండా చక్రపాణి వైపు అలాగే చూస్తూ ఉంటుంది. ఎవరు దేవయాని పలకవేంటి అని అందరూ అక్కడికి వెళ్లడంతో చక్రపాణిని చూసి అందరూ షాక్ అవుతారు. అప్పుడు చక్రపాణి రామ్మ అని అనగా వసుధార లగేజ్ తీసుకొని రావడంతో అది చూసి అందరూ షాక్ అవుతారు.అది చూసి జగతి,మహేంద్ర ఇద్దరు సంతోష పడుతూ ఉంటారు.

అప్పుడు నమస్కారం బావగారు అని ఫణింద్రకు నమస్కారం పెట్టడంతో ఏంటి ఆ పిలుపులు అనగా వసుధర ఈ ఇంటి కోడలు అయినప్పుడు మీరు నాకు అక్కయ్య గారు ఆయన బావగారు అవుతారు కదా అక్కయ్య గారు అని అంటాడు. వసుధారే తన భార్య అని రిషి సార్ అందరి ముందు చెప్పినప్పుడు నా కూతురిని నా ఇంట్లో పెట్టుకోవడం కరెక్ట్ కాదు కదా అక్కయ్య గారు అని అంటాడు ఫణీంద్ర. పాడులోకం పాడు మనుషులు నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు కదా అక్కయ్య గారు అని అంటాడు ఫణీంద్ర. అందుకే అక్కయ్య గారు మీ ఇంటి కోడలు నీకు అప్పగిస్తున్నాను అని అంటాడు. అప్పుడు దేవయాని జగతి మహేంద్ర ఏంటిది. ఏం జరుగుతుంది అని అంటుంది. అప్పుడు చక్రపాణి  సమయానికి మా ఇంటి ఆవిడ కూడా అందుబాటులో లేదు అక్కయ్య లేదంటే ఆమె కూడా వచ్చేది అని అంటాడు.

అప్పుడు వసు ఇంట్లోకి అడుగుపెడుతుంది. అప్పుడు దేవయాని ఆగు ఇంట్లోకి రావడానికి నీకు ఏమి హక్కు ఉంది ఏ అధికారంతో లోపలికి వస్తున్నావు అని అడుగుతుంది. అప్పుడు వసుధార తన మెడలో ఉన్న తాళిని దేవయానికి చూపించడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. అప్పుడు చక్రపాణి వెళ్ళొస్తాను అక్కయ్య గారు మంచి రోజు చూసి అల్లుడిని కూతురిని మా ఇంటికి తీసుకెళ్తాను అనడంతో దేవయాని కోపంతో రగిలిపోతుండగా ధరణి మహేంద్ర జగతి వాళ్ళు సంతోషపడుతూ ఉంటారు. అప్పుడు వసుధార మేడం రిషి సార్ లేచారా కాఫీ ఇచ్చారా అని అనగా పాలు రాలేదు అని ధరణి చెప్పగా ఇంతలో పాలు రావడంతో మీరు వెళ్లి పాలు కాచండి నేను దేవుడి గుడిలోకి వెళ్లి దండం పెట్టుకుంటాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

ఆ తర్వాత వసుధర దగ్గరికి జగతి మహేంద్ర వాళ్ళు రావడంతో నేను ఏమైనా తప్పు చేశానా మేడం మేడం తో చాలా మంచి పని చేశావు అని అంటుంది జగతి. అప్పుడు వసుధారకు ధైర్యం చెబుతూ చాలా మంచి పని చేశావు అని జగతి వాళ్ళు సంతోష పడుతూ ఉంటారు. మరోవైపు దేవయానితో ధరణి వెటకారంగా మాట్లాడడంతో ధరణి మరింత కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలోనే వసు అక్కడికి వచ్చి ఏంటి మేడం ఏదో అంటున్నారు ఈరోజు మంచి మేడం ఇంతకంటే మంచి రోజు ఏముంటుంది చెప్పండి అని అంటుంది. మేడం మీరు మనసులో ఏమనుకుంటున్నారో నాకు తెలిసి మీరు ఎన్ని ప్రశ్నలు వేసినా నేను రెండే సమాధానాలు చెబుతాను ఒకటి ఈ తాళి రెండవది రిషి సార్ అని నవ్వుతూ మాట్లాడగా దేవయాని  కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ధరణి మేడం రేపటి నుంచి మీకు సహాయం చేస్తాను. ఈరోజు నుంచి ఒక గ్లాస్ బియ్యం ఎక్కువగా పెట్టాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వసుధార. అప్పుడు గదిలోకి వెళ్లిన వసుధార సంతోష పడుతూ ఉంటుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios