బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లో గురువారం ప్రారంభం అయిన బ్యాటిల్ ఫర్ సర్వైవల్ టాస్క్ నేడు ఎపిసోడ్ 48లో కూడా కొనసాగింది. బ్లూ అండ్ రెడ్ టీమ్స్ పూలు, బొమ్మలు సాదించేందుకు ఫిజికల్ గా కష్టపడ్డారు.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లో గురువారం ప్రారంభం అయిన బ్యాటిల్ ఫర్ సర్వైవల్ టాస్క్ నేడు ఎపిసోడ్ 48లో కూడా కొనసాగింది. బ్లూ అండ్ రెడ్ టీమ్స్ పూలు, బొమ్మలు సాదించేందుకు ఫిజికల్ గా కష్టపడ్డారు. అర్జున్ చేస్తున్న విఫల యత్నాలపై ఫైమా సెటైర్లు వేసింది. పాపం అర్జున్ నన్ను మాత్రమే పట్టుకుంటున్నాడు అంటూ ఫైమా సెటైర్ వేసింది. 

చివరగా ఎక్కువగా బొమ్మలు పూలు సాధించిన రెడ్ టీం విజయం సాధించింది. దీనితో ఓడిపోయిన బ్లూ టీం నుంచి ఒకరు నేరుగా నామినేట్ కావాల్సి వచ్చింది. బ్లూ టీం సభ్యులు ఓటింగ్ ప్రకారం చర్చించుకున్నారు. వారి పెర్ఫామెన్ ఆధారంగా ఓటింగ్ జరిపారు. ఈ ఓటింగ్ లో ఎక్కువ ఓట్లు వసంతికి పడ్డాయి. తాను గేమ్ బాగా ఆడిన ఆడకున్నా తననే టార్గెట్ చేస్తున్నారు అంటూ ఆమె అర్జున్ తో గొడవ పెట్టుకుని అలిగి వెళ్లిపోయే ప్రయత్నం చేసింది. చివరికి అత్యధిక ఓట్లతో వాసంతి నామినేట్ కావాల్సి వచ్చింది. 

ఈ ప్రాసెస్ లో అర్జున్, శ్రీసత్య మధ్య కూడా ఆసక్తికర సంభాషణ జరిగింది. కొన్ని టాస్క్ లలో అర్జున్ సరిగ్గా పెర్ఫామ్ చేయలేదు అంటూ శ్రీ సత్య బ్లేమ్ చేయగా.. ఇలా అంటుంది అని ముందే ఊహించా అంటూ అర్జున్ ఫన్నీగా చెప్పడం నవ్వులు పూయించింది. 

అనంతరం బిగ్ బాస్ డిజాస్టర్ పేరుతో మరో గొడవ సృష్టించారు. ఈ వారం ఎవరు సరిగా పెర్ఫామ్ చేయలేదు అనిపిస్తే వాళ్లకు రీజన్స్ చెప్పి డిజాస్టర్ ట్యాగ్ తగిలించాలి. అర్జున్ రేవంత్ కి, వాసంతి గీతూకి, మెరీనా జితూకి ఇలా ఒక్కొక్కరు మరొకరికి డిజాస్టర్ ట్యాగ్స్ తగిలించారు. 

ఇక్కడ కూడా వాసంతి హాట్ టాపిక్ గా మారింది. సూర్య వసంతికి డిజాస్టర్ టాగ్ ఇస్తూ.. ఫిజికల్ టాస్క్ లో ఆమె రేవంత్ ని కొట్టింది అని ఆరోపించారు. దీనికి వాసంతి.. రేవంత్ ముందుగా తనని బలంగా గుద్దాడు అని ఆరోపించింది. వెంటనే రేవంత్ కలగజేసుకుని 'అమ్మా ఈ డ్రామాలు వద్దు' అంటూ చిరాకు పడ్డాడు. 

చివరగా వసంతికే ఎక్కువ డిజాస్టర్ ట్యాగ్స్ వచ్చాయి. దీనితో బిగ్ బాస్ ఆమెని జైలులోకి పంపారు. అనంతరం ఒక ఫన్నీ టాస్క్ తో నేటి ఎపిసోడ్ ముగిసింది.