Ennenno Janmala Bandham: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది.  నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు ఫిబ్రవరి 23వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం. 

ఈరోజు ఎపిసోడ్ లో యశోదర్ వేదవైపు చూసి బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత రిసెప్షన్ వాళ్ళు పిలిచి వేద గారి డేట్ అఫ్ బర్త్ తప్పుగా ఉంది ఒకసారి ఏదో చూసి చెప్పండి అనడంతో ఇంతలో యష్ ఏంట్రా వసంత్ ఇది చిన్న విషయాన్ని కూడా సరిగ్గా చేయలేవా ప్రతి ఒక్క విషయంలో తప్పులు చేస్తావు. బిజినెస్ మెన్ వీ అయ్యుండి అప్లికేషన్లో డేట్ అఫ్ బర్త్ రాయడం రాదా అని వసంత్ మీద సీరియస్ అవుతాడు. ఇప్పుడు ఏమైంది యష్ ఎందుకు అంతలా ఆవేశపడుతున్నావు అని వసంత్ అనడంతో ఏంట్రా నోరు లేస్తుంది నన్ను ఎదిరించి అంత పెద్ద వాడివి అయ్యావా అంటూ అనవసరంగా వసంత్ మీద సీరియస్ అవుతూ ఉంటాడు యష్.

అదంతా కూడా విన్ని చూసి యష్ ని మరింత అపార్థం చేసుకుంటాడు. అప్పుడు వసంత్ కోపంతో ఇదే నీతో ప్రాబ్లం ఎప్పుడు నీకు కోపం వస్తుందో నీకే తెలియదు. ఎవరిని ఏం తిడతావో తెలియదు. నువ్వు నీ ఈగో నేనా ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ హర్ట్ అవుతాయని అర్థం చేసుకోవా అనగా యష్ మరింత రెచ్చిపోయి కోపంగా మాట్లాడుతూ ఉంటాడు. ఇదిగో ఈ కోపమే నువ్వు ఇలాగే మాట్లాడి ఉంటావు అందుకే వదినకు ఈ పరిస్థితి వచ్చింది అని అంటాడు వసంత్. అయిన నువ్వు వదినను ఎప్పుడూ అర్థం చేసుకున్నావు అని అనగా అది చెప్పడానికి నువ్వు ఎవడ్రా అనడంతో చెప్పే హక్కు నాకుంది అని అంటాడు వసంత్.

 అప్పుడు రత్నం వారిద్దరిని సైలెంట్ గా ఉండమని చెబుతాడు. అప్పుడు విన్ని యష్ ప్రవర్తన చూసి అభి అన్న మాటలు గుర్తుతెచ్చుకొని ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత సుహాసిని ఫోన్ చేయడంతో ఈ విషయం ఖుషి కి చెప్పొద్దు సుహా తను చాలా బాధపడుతుంది అని అంటుంది సులోచన. ఇంతలోనే అక్కడికి ఖుషి వస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావు అన్నంతో అబద్ధాలు చెబుతుంది. అమ్మ ఎక్కడికి వెళ్లింది అనగా క్లినిక్ కి వెళ్ళింది అంటూ సుహా ఖుషి కి అబద్ధాలు చెబుతూ ఉంటుంది. అప్పుడు ఖుషి వేద గురించి మా అమ్మ చాలా మంచిది నా కోసం చాలా చేస్తుంది అనే గొప్పలు చెబుతూ ఉండగా ఆ మాట విన్న సుహా లో లోపలకు కుమిలిపోతు ఉంటుంది.

ఆ తర్వాత యష్, విన్నీ ఇద్దరు కలిసి డాక్టర్ దగ్గరికి వెళ్తారు. వేదకు ఏమైంది డాక్టర్ అనడంతో రిపోర్ట్స్ రావాలి అని అంటుంది. అయితే ముందు ఒక విషయం చెప్పండి. వేద టైం టు టైం తింటుందా తను ఏమన్నా మెంటల్ గా స్ట్రెస్ గా ఫీల్ అవుతుందా అని అడుగుతుంది డాక్టర్. అప్పుడు యష్ అలాంటిది ఏమీ లేదు డాక్టర్ అని అంటాడు. ఇంతకుముందు ఏమైనా ఫాస్టింగ్ ఉండేదా అనడంతో యష్ లేదు అనగా అప్పుడు విన్నీ లేదు డాక్టర్ తను ఇంతకుముందు తనకోసం తన ఫ్యామిలీ కోసం ఎక్కువగా ఉపవాసాలు ఉండేది అని అంటాడు.

అప్పుడు డాక్టర్ అడిగే ప్రశ్నలకు యష్ ఏమీ లేదు అని చెబుతుండగా విన్నీ మాత్రం వేద గురించి అన్ని తెలిసి వేద గురించి నిజాలు చెప్పడంతో అదేంటి యశోదర్ గారు మీ భార్య గురించి ఇతనికే బాగా తెలుసు అని అనగా నేను చైల్డ్ హుడ్ ఫ్రెండ్ ని అని అంటాడు విన్నీ. అప్పుడు తను చిన్నప్పుడు ఏదైనా జబ్బుతో బాధపడేదా అనడంతో అవును డాక్టర్ తను చిన్నప్పుడు స్టమక్ టీబీ తో బాధపడేది అనడంతో అయితే ఇది చాలా క్రిటికల్ కండిషన్ తన ఎట్టి పరిస్థితులలో కూడా ఉపవాసం ఉండకూడదు రెండు మూడు గంటలకు నుంచి ఉపవాసం ఉంటే చాలా క్రిటికల్ అవుతుంది అని వేద గురించి చెబుతుంది.

ఆశ్చర్యంగా ఉందే ఆవిడ భర్త కంటే ఆవిడ గురించి మీకే బాగా తెలుసు అని అంటుంది డాక్టర్. నేను వేద ఇద్దరం కలిసే పెరిగాము కలిసే చదువుకున్నాము తన గురించి నాకు పూర్తిగా తెలుసు తన మానసిక పరిస్థితి గురించి కూడా తెలుసు అంటాడు విన్నీ. అప్పుడు విన్నీ మాటలకు యష్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. మరోవైపు వసంత్ ఒక చోట నిలబడి ఆలోచిస్తూ ఉండగా ఏంటి వసంత్ అలా ఉన్నావు అనడంతో నీ ప్రవర్తన నాకు నచ్చలేదు చిత్ర అభిమన్యు కార్ లో ఎందుకు వచ్చావు అని అంటాడు. అప్పుడు వసంత్ వాడు ఒక ఇడియట్ వాడి కారే దొరికిందా నీకు అంటూ చిత్ర మీద సీరియస్ అవుతాడు. అప్పుడు చిత్ర నీకు ఒక విషయం తెలుసా వసంత్ నేను ఇప్పుడు పని చేసేది అభిమన్యు ఆఫీసులోనే అని అంటాడు అంటుంది.

అప్పుడు చిత్ర మాటలు విన్న వసంత్ షాక్ అయ్యి చిత్ర మీద సీరియస్ అవుతాడు. ఏంటి చిత్ర నువ్వు చెప్పేది వినడంతో నేను ఫస్ట్ జాయిన్ అయినప్పుడు అది అభిమన్యు కంపెనీ కాదు కానీ ఆ తర్వాత టేకోవర్ చేశాడు వన్ ఇయర్ అగ్రిమెంట్ ఉండటం వల్ల నేను ఏమి చేయలేకపోయాను అని అంటుంది చిత్ర. వసంత్ అక్కడి నుంచి వెళ్లిపోవడంతో మాళవిక కోసం నేను అక్కడ ఉంటున్నాను వసంత్ అని తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది చిత్ర. మరోవైపు యష్ వేదవైపు బాధగా చూస్తూ గతంలో వేదతో మాట్లాడిన మాటలు గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటాడు. సులోచన సుహా ఇద్దురు వేద మెడికల్ రిపోర్ట్స్ కోసం చూస్తుండగా అక్కడ లేకపోవడంతో సులోచన ఏడుస్తూ బాధపడుతూ ఉండగా ఇంతలో అక్కడికి విన్నీ వస్తాడు.

ఒక్కసారి మనశ్శాంతిగా మనస్ఫూర్తిగా ఆలోచించండి ఆంటీ మీకు గుర్తుకు వస్తుంది అని అనడంతో ఏం మాట్లాడాలో ఏం ఆలోచించాలో అర్థం కావడం లేదు బాబు అని ఏడుస్తూ మాట్లాడుతుంది సులోచన. మీరేం టెన్షన్ పడకండి ఆంటీ ఇల్లు మొత్తం వెతుకుదాము ఎక్కడో ఒకచోట వేద ఫైల్స్ దొరుకుతాయి అని విని ధైర్యం చెబుతూ ఉంటాడు. మరొకవైపు యష్,వేద వైపు చూస్తూ తప్పు చేశాను వేద. తొందరపడి నీతో పోట్లాడాను విన్నికి తెచ్చిన సంబంధం నువ్వు చెడగొట్టావ్ అని నీ మీద అనవసరంగా కోపడ్డాను అని బాధగా మాట్లాడుతూ ఉంటాడు. నేను నీ భర్తని కదా చిన్నప్పటినుంచి నీకు హెల్త్ బాగోలేదన్న విషయం నేను తెలుసుకోవాలి కదా అని తనపై తానే కోప్పడుకుంటూ ఉంటాడు. అప్పుడు వేద వైపు చూసి కన్నీళ్లు పెట్టుకుంటాడు.