Asianet News TeluguAsianet News Telugu

NTR 30 Special Song : ఎన్టీఆర్ 30లో వరుణ్ తేజ్ హీరోయిన్.. స్పెషల్ సాంగ్ కోసం అదిరిపోయే ప్లాన్..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) అప్ కమింగ్ ఫిల్మ్ ఎన్టీఆర్ 30 (NTR 30). ఈ చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనుంది. అయితే ఈ మూవీలో స్పెషల్ సాంగ్ కోసం వరుణ్ తేజ్ హీరోయిన్ ను లాక్ చేసినట్టు తెలుస్తోంది.  

Varun Tejs heroine in NTR 30 .. A long awaited plan for a special song..
Author
Hyderabad, First Published Feb 23, 2022, 6:46 AM IST | Last Updated Feb 23, 2022, 6:46 AM IST

చిన్న సినిమా అయినా.. పెద్ద సినిమా అయినా ఆడియెన్స్ కథతో పాటు స్పెషల్ సాంగ్స్ కూడా కోరుకుంటున్నారు. నాటి నుంచే ప్రతి సినిమాలోనూ ఐటెమ్ సాంగ్స్ పెడుతూ వస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇక పెద్ద  హీరోల సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ కు ఎలా ఉండబోతున్నాయో అంటూ అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ‘పుష్ప’(Pushpa) మూవీలో  సమంత (Samantha) స్పెషల్ సాంగ్ లో ఆడి, అందరి మతి పోగొట్టింది. ఇప్పటికీ ఆ సాంగ్ ట్రెండ్ అవుతూనే ఉంది. అయితే టాలీవుడ్ దర్శక నిర్మాతలు స్పెషల్ సాంగ్స్ కోసం ఏకంగా  బాలీవుడ్ హీరోయిన్లనే దింపుతున్నారు. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ అప్ కమింగ్ ఫిల్మ్ ఎన్టీఆర్ 30 మూవీపై క్రేజీ బజ్ నడుస్తోంది. ఈ మూవీలో ఐటెం సాంగ్ కోసం ఓ బాలీవుడ్ హీరోయిన్ ను లాక్ చేసినట్టు తెలుస్తోంది. 
 
జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల కాంబినేషనల్ లో మరోసారి తెరకెక్కుతున్న మూవీ ‘ఎన్టీఆర్ 30’పై ఫ్యాన్స్ ఆశలు పెంచుకుంటున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ (Alia Bhatt) ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఎన్టీఆర్ స్టూడెంట్ లీడర్ గా కనిపించబోతున్నాడని సమాచారం. కొరటాల శివ తన ప్రతి చిత్రంలో ఏదో ఒక సామాజిక కోణం ఉండేలా చూస్తున్నారు. ఈ చిత్రంలో విద్యావ్యవస్థపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. బస్తీలో పుట్టి పెరిగి మెరిట్ లో విద్యాబ్యాసం పూర్తి చేసిన యువకుడిగా ఎన్టీఆర్ కనిపిస్తాడట. 

ఇదిలా ఉంటే.. వరుణ్ తేజ్ తో (Varun Tej)  లోఫర్ మూవీలో ఆడిపాడిన బాలీవుడ్ బ్యూటీ  దిశా పటానీ  (Disha Patani)ని ఎన్టీఆర్ 30 మూవీకి డైరెక్టర్ కొరటాల శివ ఎంపిక చేసినట్టు టాక్ వినిపిస్తోంది. ఈ మూవీలో స్పెషల్ సాంగ్ లో దిశా పటాని నటించనున్నట్టు తెలుస్తోంది. లోఫర్ మూవీ తర్వాత దిశా పటానీ తెలుగు సినిమాలకు దూరంగా ఉంది. బాలీవుడ్ పైనే మొత్తంగా ఫోకస్ పెట్టింది. ఎం.ఎస్ ధోనీ, భాగీ 2, భాగీ 3, మలంగ్, రాధే మూవీలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది దిశా. ప్రస్తతుం మరో మూడు సినిమాల్లో నటిస్తోంది. ఎన్టీఆర్ 30తో మళ్లీ స్పెషల్ అపియరెన్స్ లో కనిపించనుంది. దిశా గ్లామర్, స్పెషల్ స్టెప్పులతో  తెలుగు ఆడియెన్స్, ఫ్యాన్స్ మతిపోవాల్సిందేనంటున్నారు. 

ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ (RRR) చిత్ర రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తున్నాడు. సంక్రాంతికే విడుదల కావాల్సిన ఈ మూవీ కోవిడ్ కారణంగా వాయిదా పడింది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ వరుస చిత్రాలతో బిజీ కాబోతున్నారు.  ప్రస్తుతం ఎన్టీఆర్ తన 30వ చిత్రంలో కొరటాల శివ దర్శకత్వంలో నటించబోతున్నాడు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios