Asianet News TeluguAsianet News Telugu

'వాల్మీకి' సీక్రెట్ : శోభన్ బాబు సాంగ్ రీమిక్స్ కి కారణం.!

.ఓ దుర్మార్గుడైన  రౌడీ షీటర్ లో ఓ సినీ దర్శకుడి వల్ల మార్పు వస్తుంది. వాల్మికి కథ కూడా అంతే.  ఒక దొంగ‌లోని ప‌రివ‌ర్త‌న అన్న‌ది వాల్మీకి క‌థ‌. అందుకే వాల్మికిని గుర్తు చేసేందుకు ఈ కథ కు ఈ టైటిల్ పెట్టారు.

Varun teja's Valmiki: Elluvachi Godaramma Song Remix
Author
Hyderabad, First Published Sep 11, 2019, 2:05 PM IST

సాధారణంగా మెగా హీరోల సినిమాల్లో చిరంజీవి సూపర్ హిట్ సాంగ్స్ ని రీమిక్స్ చేస్తూంటారు. అయితే వరణ్ తేజ తాజా చిత్రం వాల్మీకి లో మాత్రం శోభన్ బాబు సూపర్ హిట్ సాంగ్ వెల్లువచ్చి గోదారమ్మ సాంగ్ ను రీమిక్స్ చేస్తున్నారు. అయితే అందుకు ప్రత్యేకమైన కారణం ఉందిట.  ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో వరుణ్ తేజ ప్రేయసిగా పూజా హెగ్డే నటిస్తోంది.  ఇందులో వరణ్ తేజ పేరు 'గద్దలకొండ గణేష్' .  

ఆ ప్లాష్ బ్యాక్ 1982 కాలం నాటి కథతో జరుగుతుందిట. అప్పట్లో  పూజా హెగ్డే శోభన్ బాబుకి వీరాభిమానిట. దాంతో పూజా హెగ్డేను ఇంప్రెస్ చేయడానికి గణేష్ ..శోభన్ బాబు సాంగ్ ఎత్తుకుంటాడట.  అందుకోసం 1982లో వచ్చిన సూపర్ హిట్ సినిమా దేవత సినిమాలో వెల్లువచ్చి గోదారమ్మ సాంగ్ ను రీమిక్స్ చేసినట్టు చెప్తున్నారు. ఈ పాట ఎంతో సూపర్ హిట్ అయింది. వేటూరి, ఆత్రేయ రాసిన ఈ పాటకు చక్రవర్తి సంగీతం అందించారు. బాలు, సుశీల ఆలపించారు.

కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో వచ్చిన తమిళ సూపర్ హిట్ చిత్రం 'జిగర్తాండ'కు రీమేక్‌గా వస్తున్న ఈ సినిమాను హరీశ్ శంకర్ తెరకెక్కిస్తున్నాడు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించనున్నాడు. అలాగే, తమిళ హీరో అధర్వ మురళి కీలక పాత్ర పోషిస్తున్నాడు. పూజా హెగ్డే, మృణాళిని రవి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.
 
 ఈ సినిమాలో కథ ప్రకారం ...ఓ దుర్మార్గుడైన  రౌడీ షీటర్ లో ఓ సినీ దర్శకుడి వల్ల మార్పు వస్తుంది. వాల్మికి కథ కూడా అంతే.  ఒక దొంగ‌లోని ప‌రివ‌ర్త‌న అన్న‌ది వాల్మీకి క‌థ‌. అందుకే వాల్మికిని గుర్తు చేసేందుకు ఈ కథ కు ఈ టైటిల్ పెట్టారు.
 
 ఈ చిత్రానికి  సినిమాటోగ్రఫీ: అయనంకా బోస్‌, కథ: కార్తీక్‌ సుబ్బరాజ్‌, స్క్రీన్‌ప్లే: మధు, చైతన్య, ఆర్ట్‌: అవినాష్‌ కొల్ల, ఎడిటింగ్‌: ఛోటా కె.ప్రసాద్‌, ఫైట్స్‌: రామ్‌లక్ష్మణ్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: హరీష్‌ కట్టా, నిర్మాతలు: రామ్‌ ఆచంట, గోపీ ఆచంట, మాటలు-దర్శకత్వం: హరీష్‌ శంకర్‌. 

Follow Us:
Download App:
  • android
  • ios